News May 10, 2024
విజయనగరం: ఒక లైట్, ఒక ఫ్యాన్‌కి రూ.37,484
ఒక లైట్, ఒక ఫ్యాన్ వాడుతున్న ఇంటికి వేలల్లో కరెంట్ బిల్లు వచ్చిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. రామభద్రపురం మండలం కొట్టక్కికి చెందిన ఇష్టం వెంకమ్మ అనే ఒంటరి మహిళ తన కుమారుడుతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం విద్యుత్ సిబ్బంది వచ్చి రీడింగ్ తియ్యగా రూ.37,484 బిల్లు వచ్చింది. దీంతో 1092 ఫిర్యాదు చెయ్యగా సమస్య పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.
Similar News
News November 5, 2024
VZM: సింగిల్ విండో ద్వారా రాజకీయ పార్టీలకు అనుమతులు
విజయనగరం జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీల అభ్యర్థులకు సింగిల్ విండో ద్వారా అవసరమైన అనుమతులు మంజూరు చేయనున్నట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అంబేడ్కర్ వెల్లడించారు. ఈ సింగిల్ విండో సెల్‌కు నోడల్ అధికారిగా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎల్.జోసెఫ్ వ్యవహరిస్తారని, బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనల నిర్వహణకు అనుమతులు ఆయనే ఇస్తారని చెప్పారు.
News November 5, 2024
VZM: టెట్ టాపర్లకు కలెక్టర్ అభినందనలు
టెట్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపి, రాష్ట్రస్థాయిలో మొదటి, రెండవ ర్యాంకులను సాధించిన విద్యార్థినులను విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అభినందించారు. టెట్‌లో జిల్లాకు చెందిన కోండ్రు అశ్వని 150/150 మార్కులను, దాసరి ధనలక్ష్మి 149.99 మార్కులను సాధించి రాష్ట్రస్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానంలో నిలిచారు. అలాగే 149.56 మార్కులను సాధించిన దేవ హారికకు అభినందనలు తెలిపారు.
News November 5, 2024
TET RESULTS: మన విజయనగరం అమ్మాయికి 150/150 మార్కులు
టెట్ ఫలితాల్లో విజయనగరం అమ్మాయి కొండ్రు అశ్విని ఎస్జీటీ(పేపర్1-ఏ)లో 150కి 150 మార్కులు సాధించి ఏపీ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆటో డ్రైవర్ అయిన శంకర్రావు, తల్లి వెంకటలక్ష్మి ఆమె సాధించిన మార్కుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంచి టీచర్‌గా మారి పిల్లలను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె తెలిపింది. వీటి అగ్రహారానికి చెందిన ధనలక్ష్మి 149.99/150, చీపురుపల్లికి చెందిన హారిక 149.46/150 మార్కులు సాధించారు.