News May 10, 2024
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు ఓటు వేయొచ్చా?
ప్రివెంటివ్ డిటెన్షన్ కింద పలు సందర్భాల్లో వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. కేసు విచారణ ప్రారంభం కాకపోవడం వల్ల రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, 1951 కింద వీరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వీరు ఓటు వేయొచ్చు. అయితే పోలింగ్ తేదీకి కనీసం 15 రోజుల ముందు రిటర్నింగ్ ఆఫీసర్‌కు సమచారం ఇవ్వాలి. కస్టడీలో ఉన్న ప్లేస్ నుంచి పోస్టు ద్వారా ఓటును పంపిస్తారు. <<-se>>#Elections2024<<>>
Similar News
News December 26, 2024
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే హీరోలు వీళ్లే?
తెలంగాణ CM రేవంత్‌తో సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలోని 36 మంది సభ్యుల బృందం నేడు సమావేశం కానున్న సంగతి తెలిసిందే. హీరోలు వెంకటేశ్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీతో పాటు దర్శకులు త్రివిక్రమ్, హరీశ్ శంకర్, అనిల్, బాబీ, వంశీ తదితరులు కలిసే అవకాశం ఉంది. నిర్మాతల్లో అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలుస్తారని సమాచారం.
News December 26, 2024
రూ.99 మద్యంలో తగ్గిన నాణ్యత?
AP: కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రూ.99కే క్వార్టర్ మద్యంలో కాస్త నాణ్యత లోపించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆల్కహాల్ శాతం అలాగే ఉన్నా రుచిలో కొంత వ్యత్యాసం కనిపిస్తోందని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒకట్రెండు ఫేమస్ బ్రాండ్లు నాణ్యతలో రాజీపడుతున్నట్లు సమాచారం. అయితే ప్రమాణాలకు అనుగుణంగా మద్యం ఉండటంతో ఎక్సైజ్ శాఖ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.
News December 26, 2024
వైకుంఠ ఏకాదశి: ఆ పది రోజులు వారికి నో ఎంట్రీ
AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి 9న ఉ.5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు ఇస్తామని TTD ఈవో శ్యామలరావు చెప్పారు. సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. మిగతా తేదీలకు ఒక రోజు ముందుగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. టోకెన్లు లేని వారికి ఈ పది రోజుల్లో శ్రీవారి దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు.