News May 10, 2024
కోటబొమ్మాళిలో రోడ్డు ప్రమాదం

కోటబొమ్మాలి మండలం పాకివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే అంబులెన్స్,108లలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 8, 2026
శ్రీకాకుళం: ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలకు వేళాయె!

మెరుగైన ఇంగ్లిష్ మీడియం విద్యకు చిరునామాగా మారిన ఏపీ మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 13 మోడల్ స్కూల్స్ ఉండగా, ఒక్క స్కూల్‌లో 100 సీట్లకు ప్రవేశాలుంటాయి. జిల్లాలో 1300 సీట్లు ఉన్నాయి. ఆన్లైన్లో ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
News March 8, 2026
శ్రీకాకుళం: ‘ప్రేమించి.. ఉద్యోగం వచ్చాక ముఖం చాటేశాడు’

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఉద్యోగం వచ్చాక ముఖం చాటేస్తున్నాడని హిరమండలం భగీరదపేటకు చెందిన ఓ యువతి వాపోయింది. ఈ మేరకు శనివారం హిరమండలంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలతో కలిసి మౌనదీక్ష చేపట్టింది. భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు తనని కొన్నేళ్లుగా ప్రేమించి తీరా ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోమంటే చేసుకోను అంటున్నాడని తెలిపింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరింది.
News March 8, 2026
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

కంచిలి మండలం బొనమాలి గ్రామానికి చెందిన బీ.బాలకృష్ణ (29) అనే ఆర్మీ జవాన్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన బంధువు పెళ్లి పిలుపులు కోసం ఒరిశా ప్రాంతానికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా కొత్త శాసనం వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనలో మరో ఇద్దరు గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


