News May 10, 2024
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది: ABD
హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించారు. రోహిత్, బుమ్రా వంటి సీనియర్లున్న చోట అలాంటి ధోరణి పనికిరాదని హితవు పలికారు. ‘తన కెప్టెన్సీ అలాగే ఉండాలని, ధోనీ మాదిరి చేద్దామని పాండ్య ప్రయత్నిస్తున్నాడు. యువకులు అధికంగా ఉన్న GT టీమ్‌లో ఆ శైలి పనిచేస్తుంది. అత్యంత అనుభవజ్ఞులున్న MIలో అందరూ దాన్ని అంగీకరించరు’ అని ఏబీడీ సూచించారు.
Similar News
News December 26, 2024
సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవేనా?
TG: సినీ ప్రముఖుల ముందు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచనున్నట్లు తెలుస్తోంది. వీటిపై నిర్మాతలు, దర్శకులు, హీరోలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు.
1.సినిమా టికెట్లపై విధించే సెస్సును ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి.
2.డ్రగ్స్‌కు వ్యతిరేకంగా హీరో, హీరోయిన్ ప్రచార కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనాలి.
3.కులగణన సర్వే ప్రచార కార్యక్రమాలకు సహకరించాలి.
News December 26, 2024
అంబటి రాంబాబు సంచలన ట్వీట్
AP: వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజున మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు. ‘దీక్షలో ఉన్న ధీరుడిని టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 36 సంవత్సరాలు. జోహార్ వంగవీటి మోహన రంగా’ అని Xలో పేర్కొన్నారు. కాగా 1988లో బెజవాడలో జరిగిన అల్లర్లలో మోహన రంగాను ప్రత్యర్థులు హతమార్చారు.
News December 26, 2024
మంత్రులు, అధికారులతో సీఎం సమావేశం
సినీ ప్రముఖులతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమావేశం అయ్యారు. సినీ పరిశ్రమ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆలోచనలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం పోలీస్ కమాండ్ సెంటర్ (CCC)లో నిర్మాతలు, దర్శకులు, నటులతో సీఎం భేటీ కానున్నారు.