News May 10, 2024
RR: పోటీ చేసేది ఇక్కడ.. ఓటు వేసేది అక్కడ!

పోటీ చేసేది ఇక్కడ.. ఓటు వేసేది అక్కడ. ఇది ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి. మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డికి తాండూరు అసెంబ్లీ, చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఓటు హక్కు ఉంది. చేవెళ్ల BRS నుంచి పోటీ చేస్తున్న కాసానికి జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ఓటు హక్కు ఉంది. దీంతో వారికి వారు ఓటు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
Similar News
News January 8, 2026
IT కారిడార్‌లో అర్ధరాత్రి బేఫికర్!

ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చే టెక్కీలైనా, రాత్రివేళ నడిచే సామాన్యులైనా చీకటి గల్లీల్లో అడుగు వేయాలంటే భయం. ఈ భయాన్ని పోగొట్టడానికే శేరిలింగంపల్లిలో రూ.50 కోట్లతో జీహెచ్‌ఎంసీ కొత్త వెలుగులు నింపుతోంది. కేవలం లైట్లు వేయడమే కాదు.. అవి ఐదేళ్ల పాటు వెలిగేలా గ్యారెంటీ బాధ్యత కూడా కాంట్రాక్టరుదేనని అధికారులు తెలిపారు. దీంతో మన రోడ్లపై రాత్రిపూట కూడా సురక్షితంగా, ధీమాగా తిరిగే భరోసా లభిస్తుంది.
News January 8, 2026
కాచిగూడలో హిందూ- ముస్లిం లవ్ మ్యారేజ్

నగరంలో అంతర్మత వివాహం చట్టబద్ధంగా నమోదైంది. హిందూ–ముస్లిం యువతి యువకుల మధ్య జరిగిన ఈ వివాహాన్ని కాచిగూడ PSలో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేశారు. మేజర్ల సమ్మతితో, అన్ని చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ వివాహ ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
News January 8, 2026
HYD: RTC స్పెషల్ బస్సులు.. 50% స్పెషల్ రేట్లు

సిటీ నుంచి సంక్రాంతికి సొంతూరికి వెళ్లేందుకు నగరవాసి సిద్ధమవుతున్నాడు. అయితే ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతున్న బస్సుల్లో ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేక టికెట్ ధరలు ఉంటాయి. అంటే అదనంగా 50% వసూలు చేస్తారన్నమాట. పండగ సమయాల్లో అదనపు ఛార్జీ వసూలుకు సంబంధించి గతంలోనే ప్రభుత్వం అనుమతులిస్తూ జీవో 50 జారీ చేసింది. ఈ మేరకు స్పెషల్ రేట్స్ ఉంటాయి. అయినా.. అవసరం ప్రజలది.. అవకాశం పాలకులది కదా.


