News May 10, 2024
LTI యాక్ట్‌కు అసెంబ్లీలో చంద్రబాబు మద్దతిచ్చారు: సజ్జల
AP: లాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు ప్రజల్ని భయపెడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ‘అసలు వీళ్లు మనుషులేనా? విపక్షంగా ఉన్న టీడీపీ ఈ బిల్లుకు పూర్తి మద్దతిచ్చింది. ఇప్పుడు పత్రికల్లో అడ్డగోలు ప్రకటనలు ఇస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ పూర్తయ్యాక భూమికి ప్రభుత్వం పూచీ ఇస్తుంది. ఈ యాక్ట్ చెత్త అని మోదీ, అమిత్ షాతో చెప్పించగలరా?’ అని ప్రశ్నించారు.
Similar News
News December 26, 2024
కేంద్రం అనుమతిస్తే డీజిల్ టూ ఎలక్ట్రిక్ బస్సు?
TG: పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. రెట్రో ఫిట్ మెంట్ పాలసీ ద్వారా మార్చేందుకు కేంద్రాన్ని సాయం కోరింది. కొత్త ఎలక్ట్రిక్ బస్సు రూ.1.50 కోట్ల పైనే ఉండటంతో ఈ వైపు ఆలోచనలు చేస్తోంది. పాత బస్సులను మార్చడం ద్వారా సంస్థపై వ్యయ భారం తగ్గే అవకాశం ఉంది. కేంద్రం దీనికి అనుమతిస్తే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి.
News December 26, 2024
బెనిఫిట్ షోలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి
సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పినదానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు.
News December 26, 2024
సీఎంతో భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరం
TG: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి చిరంజీవి హాజరుకాలేదు. సినీ పెద్దలంతా కలిసి వస్తారని భావించినా సీనియర్ హీరోల్లో కేవలం నాగార్జున, వెంకటేశ్ మాత్రమే కనిపించారు. చెన్నైలో స్నేహితుడి కూతురి పెళ్లికి వెళ్లడం వల్లే ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు చిరు టీం తెలిపింది. హీరోల్లో వరుణ్ తేజ్, శివ బాలాజీ, కళ్యాణ్ రామ్, అడివి శేష్, కిరణ్ అబ్బవరం, రామ్, సిద్ధూ జొన్నలగడ్డ, నితిన్, సాయిధరమ్ తేజ్ వచ్చారు.