News May 10, 2024
సర్వీస్, క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్లు అంటే ఎవరు?
ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 20(8)లో సర్వీస్ ఓటరు గురించి నిర్వచించారు. సాయుధ దళాల్లో పనిచేసే ఉద్యోగులు, రాష్ట్రం, దేశం వెలుపల విధులు నిర్వహించే ఉద్యోగులను సర్వీస్ ఓటర్లుగా పిలుస్తారు. కాగా సాయుధ దళాల్లో పని చేసే ఉద్యోగులు వేరే ప్రదేశంలో విధుల్లో ఉంటే తమ బదులు వేరే వ్యక్తిని ఓటు వేసేందుకు నియమించుకోవచ్చు. అలాంటి సమయాల్లో సర్వీస్ ఓటర్లను క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్లుగా పరిగణిస్తారు.
Similar News
News January 8, 2025
లోన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్
లోన్లపై వడ్డీరేట్లకు సంబంధించి కస్టమర్లకు HDFC ఉపశమనం కలిగించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా లోన్లపై వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం HDFC MCLR 9.15% నుంచి 9.45% వరకు ఉన్నాయి. సవరించిన వడ్డీ రేట్లు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. MCLRను బట్టే బ్యాంకులు వివిధ రకాల లోన్లపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి.
News January 8, 2025
ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు ఉండవా?
AP: ఇంటర్మీడియట్‌లో కీలక సంస్కరణలు రానున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు లేకుండా CBSE తరహాలో కోర్సులో ఒకేసారి సెకండియర్‌లో ఎగ్జామ్స్ పెట్టాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీంతో చదువుకునేందుకు ఎక్కువ సమయం లభించి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని భావిస్తోంది. మొదటి ఏడాది అంతర్గత మార్కుల విధానం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే ముందుకెళ్లనుంది.
News January 8, 2025
మరో అమ్మాయితో చాహల్ (PHOTO)
ధనశ్రీతో విడాకుల వార్తల నేపథ్యంలో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరో అమ్మాయితో కెమెరాకు చిక్కారు. ముంబైలోని ఓ హోటల్ నుంచి బయటకు వచ్చే సమయంలో చాహల్ తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని కనిపించారు. ఆ యువతి పేరు తనిష్క కపూర్ అని, కన్నడలో రెండు సినిమాల్లో నటించినట్లు వార్తలు వస్తున్నాయి. ధనశ్రీతో పరిచయం కాకముందు వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు సమాచారం. అప్పట్లో చాహల్ ఈ వార్తలను కొట్టిపారేశారు.