News May 10, 2024

జూన్ 2న జైలుకి కేజ్రీవాల్

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే.. జూన్ 2న ఆయన తిరిగి జైలుకు రావాలని కోర్టు సూచించింది. అంతకుముందు కేజ్రీవాల్ తరఫు లాయర్ అభిషేక్ సింఘ్వీ ఎన్నికల ఫలితాల మరుసటి రోజైన జూన్ 5 వరకు బెయిల్ కావాలని కోరారు. కానీ.. ఆ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. జూన్ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది.

Similar News

News January 8, 2025

హైదరాబాద్‌లో 11 చైనా వైరస్ కేసులు!.. అందరూ డిశ్చార్జ్!

image

HYDలో గతేడాది DECలోనే hMPV కేసులు నమోదైనట్లు ఓ ప్రైవేట్ ల్యాబ్ వెల్లడించింది. 258 మందికి శ్వాసకోశ వైద్య పరీక్షలు చేయగా 11 శాంపిల్స్‌లో hMPV పాజిటివ్ అని తేలిందని మణి మైక్రో బయాలజీ ల్యాబ్ తెలిపింది. వారు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. ఈ వైరస్ కొత్తదేం కాదని, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొంది. hMPV ఇండియాలో ఎప్పటి నుంచో ఉందని ICMR కూడా వెల్లడించిందని వివరించింది.

News January 8, 2025

లోన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్

image

లోన్లపై వడ్డీరేట్లకు సంబంధించి కస్టమర్లకు HDFC ఉపశమనం కలిగించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా లోన్లపై వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం HDFC MCLR 9.15% నుంచి 9.45% వరకు ఉన్నాయి. సవరించిన వడ్డీ రేట్లు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. MCLRను బట్టే బ్యాంకులు వివిధ రకాల లోన్లపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి.

News January 8, 2025

ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు ఉండవా?

image

AP: ఇంటర్మీడియట్‌లో కీలక సంస్కరణలు రానున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు లేకుండా CBSE తరహాలో కోర్సులో ఒకేసారి సెకండియర్‌‌లో ఎగ్జామ్స్ పెట్టాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీంతో చదువుకునేందుకు ఎక్కువ సమయం లభించి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని భావిస్తోంది. మొదటి ఏడాది అంతర్గత మార్కుల విధానం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే ముందుకెళ్లనుంది.