News May 10, 2024
HYD శివారులో విషాదం.. బాలుడి మృతి

HYD శివారు మొయినాబాద్ సుజాత స్కూల్‌లో విషాద ఘటన వెలుగుచూసింది. 2వ తరగతి చదువుతోన్న విద్యార్థి శివశౌర్య సమ్మర్ క్యాంపులో భాగంగా స్విమ్మింగ్ ఫూల్‌లో శిక్షణ తీసుకొంటున్నారు. ఈత కొట్టేందుకు నీళ్లలో దిగి దుర్మరణం చెందారు. విషయం బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం ప్రయత్నం చేసిందని తల్లిదండ్రులు స్కూల్ ట్రైనర్‌కు దేహశుద్ధి చేశారు. మృతి చెందిన బాలుడు మొయినాబాద్ మం. సురంగల్‌కి చెందినట్లు సమాచారం.
Similar News
News March 14, 2026
సమ్మర్ ఎఫెక్ట్.. HYDలో KG@325

ఎండకాలం ప్రారంభంలోనే చికెన్ ధరలు కొండెక్కాయి. శనివారం KG చికెన్ రూ.325 నుంచి 330 వరకు పలకడం గమనార్హం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కిలో స్కిన్‌తో కూడిన చికెన్ ధర రూ.286గా ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.325కు చేరుకుంది. వేసవి మొదలులో ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ధరలు ఇంకెంత పెరుగుతాయోనని చికెన్ ప్రియులు సందేహ పడుతున్నారు. మీ ఏరియాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 14, 2026
HYD: రూ.5కే భోజనం.. గ్యాస్ ఇబ్బందులు లేవు!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.5 కే భోజనానికి గ్యాస్ ఇబ్బంది ఇప్పట్లో లేనట్లే. ఎందుకంటే ఇక్కడ అన్నం, పప్పును సోలార్ ప్యానల్ ద్వారా వచ్చే విద్యుత్‌తో వండుతారు. తక్కువ మొత్తంలో మాత్రమే గ్యాస్ వినియోగం ఉంటుంది. అయితే దీనికి నిల్వలు ఉన్నాయని, మరికొంత కాలం ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదే రీతిలో అందరూ వాడితే గ్యాస్ వినియోగం తగ్గించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
News March 14, 2026
‘500 మంది ‘సైబర్ సింబా’లకు శిక్షణ’

సైబర్ నేరగాళ్లను అడ్డుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నేరాలు ఆగడం లేదు. దీంతో ‘సైబర్ సింబా’ పేరుతో వాలంటీర్లను సిద్ధం చేశారు. తొలిదశలో 500 మందికి శిక్షణ ఇచ్చారు. వీరు పోలీస్ స్టేషన్‌తో అనుసంధానమై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వీరికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు. సైబర్ నేరాల అడ్డుకట్టలో భాగం కావాలని పిలుపునిచ్చారు.


