News May 10, 2024

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ కీలక ఆదేశాలు

image

AP: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక జాబితాను ఆర్వోకు ఇవ్వాల్సిన అవసరం లేదని.. పోలింగ్ రోజు ప్రిసైడింగ్ అధికారికి సమర్పిస్తే చాలని వెల్లడించింది. అయితే పోలింగ్ ఏజెంట్లను ఆయా పార్టీల అభ్యర్థులు ధ్రువీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో ఏజెంట్ల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని స్పష్టం చేసింది.

Similar News

News March 15, 2026

అంగన్వాడీల్లో చిన్నారులకు పాలు

image

TG: పౌష్టికాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా అంగన్వాడీల్లో చిన్నారులకు ఇకపై పాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి 3-6 ఏళ్ల పిల్లలకు రోజూ 100ML ఇవ్వనుంది. రాష్ట్రంలోని 35,781 అంగన్వాడీల్లో 4.5L మంది పిల్లలు నమోదు చేసుకున్నారు. వీరికి పాలు ఇవ్వాలంటే రోజుకు 45 వేల లీటర్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విజయ లేదా నందినీ డెయిరీ నుంచి మిల్క్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News March 15, 2026

ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగాలు!

image

ఇండియన్ నేవీలో అగ్నివీర్(SSR, MR, SSR Medical) పోస్టుల భర్తీకి దరఖాస్తులు మొదలయ్యాయి. ఆసక్తి, అర్హత గల అవివాహిత పురుషులు, మహిళలు APR 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి టెన్త్, 10+2(మ్యాథ్స్, ఫిజిక్స్) లేదా డిప్లొమా పూర్తిచేసిన వారు అర్హులు. వయసు 17.5-21 ఏళ్లు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, PFT, రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఫీజు: రూ.550 + GST. వెబ్‌సైట్: joinindiannavy.gov.in

News March 15, 2026

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

image

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ పిడుగులు పడే ఆస్కారముందని చెప్పింది. మరోవైపు ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకు TGలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, HYD, మేడ్చల్, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెంలో ఉరుములతో కూడిన వానలు పడతాయని వాతావరణ నిపుణులు తెలిపారు.