News May 10, 2024

జూన్ 4న ఏపీలో టీడీపీ కనుమరుగు: ఎంపీ VSR

image

AP: టీడీపీ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ అడుగడుగునా ఆ పార్టీ రాజీపడుతోందని YCP ఎంపీ విజయసాయిరెడ్డి Xలో ఎద్దేవా చేశారు. నల్ల నాగుపాము, టీడీపీ లీడర్ ఒకేసారి కనిపిస్తే ముందుగా టీడీపీ నేతనే కొట్టాలని పిలుపునిచ్చారు. ‘రాజ్యసభలో టీడీపీ కనుమరుగైంది. తెలంగాణలో ఆ పార్టీ అంతమయ్యింది. జూన్ 4న ఏపీలోనూ సైకిల్ పార్టీ కనుమరుగు కాబోతోంది’ అని జోస్యం చెప్పారు.

Similar News

News March 21, 2026

రేపు బాపట్ల బీచ్‌కు పోటెత్తనున్న ముస్లింలు

image

రంజాన్ పండగ అనంతరం ముస్లింలు సముద్ర తీరాలకు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ఈ నేపథ్యంలో బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశించారు. రంజాన్, ఆదివారం కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. పర్యాటకుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పార్కింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు.

News March 21, 2026

వచ్చే వారం భీకర దాడులు: ఇజ్రాయెల్

image

పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించట్లేదు. వచ్చే వారం ఇరాన్‌పై దాడుల తీవ్రతను పెంచుతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ వెల్లడించారు. ఇరాన్ అడ్మినిస్ట్రేషన్, కమాండర్లు, కీలక స్థావరాలను టార్గెట్ చేస్తామన్నారు. ఇరాన్‌పై దాడులను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కట్జ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

News March 21, 2026

ఆకాశంలోనే జీవితం.. కాపురం కూడా!

image

ప్రకృతిలో ‘కామన్ స్విఫ్ట్’ అనే పక్షి ఓ అద్భుతం. ఏకధాటిగా 10 నెలల పాటు భూమిపై వాలకుండా ఆకాశంలోనే జీవించగలిగే సామర్థ్యం దీని సొంతం. వింత ఏమిటంటే.. ఇది గాలిలోనే ఆహారం తింటుంది, జతకడుతుంది, చివరికి ఎగురుతూనే నిద్రపోతుంది. కేవలం గుడ్లు పెట్టడానికి మాత్రమే ఈ పక్షి నేలపైకి వస్తుంది. మెదడులో సగభాగాన్ని అలర్ట్‌గా ఉంచి గాల్లోనే నిద్రపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో