News May 10, 2024

చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసిన అన్నగా జగన్ నిలిచిపోతారు: షర్మిల

image

AP: రాజన్న బిడ్డనన్న ఇంగితం లేకుండా నాపై, నా పుట్టుకపై రాక్షస సైన్యంతో జగన్ ప్రచారం చేయిస్తున్నారని షర్మిల ఆరోపించారు. ‘చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేయించిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. మీ కోసం త్యాగం చేసిన చెల్లిని గౌరవించకపోగా.. మానసికంగా హింసిస్తారా? ఈ ఐదేళ్లలో మీతో ఒక్క పైసా పని చేయించుకున్నానా? ప్రపంచంలో రాజకీయ విభేదాలు ఉన్నవారు చాలామంది ఒకే కుటుంబంలో లేరా?’ అని ఆమె ప్రశ్నించారు.

Similar News

News November 8, 2025

ఘోర ప్రమాదం.. కారు ఎలా ధ్వంసమైందో చూడండి!

image

UPలోని షమ్లీలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు వైరల్‌గా మారాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును స్విఫ్ట్ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు కజిన్ బ్రదర్స్ చనిపోగా, ఒకరికి రేపు పెళ్లి కావాల్సి ఉంది. ఘటన జరిగినప్పుడు కారులోని భాగాలు 100M దూరంలో పడ్డాయి. వాహనం నామ రూపాల్లేకుండా మారడంపై SMలో చర్చ జరుగుతోంది. కొన్నికార్లలో సేఫ్టీ అధ్వానంగా ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News November 8, 2025

న్యూస్ రౌండప్

image

▶ బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీని కలిసిన PM మోదీ. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా విషెస్
▶ USలో అనారోగ్యంతో APలోని కారంచేడుకు చెందిన విద్యార్థిని రాజ్యలక్ష్మి(23) మృతి
▶ UPA హయాంలో 88వేల మంది అక్రమ వలసదారులను తిప్పి పంపామన్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
▶ బిహార్ ఎన్నికల వేళ అన్నదమ్ములు తేజస్వీ యాదవ్‌, తేజ్ ప్రతాప్ మధ్య ముదిరిన వైరం.. సోదరుడితో ఇక ఎన్నటికీ బంధం ఉండదన్న తేజ్ ప్రతాప్

News November 8, 2025

త్వరలోనే మహిళలకు రూ.2,500: జగ్గారెడ్డి

image

TG: వృద్ధులకు రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2,500 సాయం అందించే పథకాలు త్వరలోనే అమలు అవుతాయని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. ఇందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుందన్నారు. ఈ స్కీముల అమలుకు సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారని, నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని మీడియా సమావేశంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.