News May 10, 2024

కాంగ్రెస్ పాలనలో HYDలో బాంబు పేలుళ్లు: మోదీ

image

దేశాన్ని లూటీ చేయడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పాలనలో HYDలో ఎన్నో చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా గుడి వద్ద బాంబు పేలింది. వారి పాలనలో పార్కు, గుడికి వెళ్లాలన్నా, బస్సు ఎక్కాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ NDAలో ఇలాంటివి ఎప్పుడైనా వినిపించాయా? గత పదేళ్లలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించాం’ అని HYD సభలో వెల్లడించారు.

Similar News

News February 16, 2026

అక్కడ BRS+BJP.. ఇక్కడ BRS+కాంగ్రెస్

image

TG: కామారెడ్డి మున్సిపాలిటీలో BJPకి చెక్ పెట్టేందుకు INC, BRS ఒక్కటయ్యాయి. ఇక్కడ INC-19, BJP-16, BRS-11, స్వతంత్రులు ముగ్గురు గెలిచారు. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో INC, BRS పొత్తు పెట్టుకున్నట్లు సమాచారం. మళ్లీ INCలో చేరిన రెబల్ అభ్యర్థి ఉమారాణి‌కే ఛైర్ పర్సన్ పదవి ఇచ్చేందుకు 2 పార్టీలు అంగీకరించాయి. BRSకు వైస్ ఛైర్మన్(కాసర్ల గోదావరి) పదవి దక్కనుంది. అటు అమరచింతలో BRS-BJP ఒక్కటయ్యాయి.

News February 16, 2026

APPLY NOW: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఉడిపి<<>> కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 13 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. సంబంధిత విభాగంలో BE, BTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. AGMకు నెలకు రూ.1.65,440, Sr.మేనేజర్‌కు రూ.1,44,760, మేనేజర్‌కు రూ.1,24,080, డిప్యూటీ మేనేజర్‌కు రూ.1,03,400 చెల్లిస్తారు. PPP,గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cochinshipyard.in

News February 16, 2026

ఆలయ శిఖరం ఎత్తుగా ఎందుకు ఉంటుంది?

image

ఆలయ నిర్మాణం భగవంతుని శయన రీతిని పోలి ఉంటుంది. గోపురం స్వామి పాదాలకు, గర్భాలయం శిరస్సుకు ప్రతీకలు. గోపురం ఎత్తుగా ఉంటే దూర ప్రాంతాల వారికి సులువుగా తెలుస్తుంది. గోపుర దర్శనం పాద నమస్కారంతో సమానం. ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఎత్తైన ఆలయాలు రక్షణ కేంద్రాలుగా నిలుస్తాయి. దేవుడు సర్వోన్నతుడనే భావనను పెంచేందుకు, భక్తులలో ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించేందుకు ఆగమశాస్త్రం ప్రకారం గోపురాలను ఎత్తులో నిర్మిస్తారు.