News May 10, 2024
సోలార్ స్టాక్స్ జోరు.. ఏడాదిలో 1,318% రిటర్న్స్! – 2/2

పునరుత్పాదక శక్తికి పెరుగుతున్న డిమాండే ఈ సోలార్ స్టాక్స్ వృద్ధికి కారణమనేది నిపుణుల మాట. వారీ రెన్యూవబుల్ ఏడాదిలో 1318% రిటర్న్స్ ఇస్తే తర్వాతి స్థానాల్లో WAA సోలార్ (561%), జోడియాక్ ఎనర్జీ (393%), SJVN (236%), KP ఎనర్జీ (214%), అదానీ పవర్ (154%) ఉన్నాయి. 2030కి 340 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సాధనకు కేంద్రం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ ‘సోలార్’ డిమాండ్ కొనసాగుతుందంటున్నారు నిపుణులు.
Similar News
News July 4, 2025
రాష్ట్రంలో 3 దాడులు.. 6 కేసులు: అంబటి

AP: రాష్ట్రంలో పరిస్థితి మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా తయారైందని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. రోజూ ఎక్కడో ఓ చోట YCP కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ‘రెడ్ బుక్ కోసం కొందరు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు కలిసి పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపటం లేదు. ఎవరు చంపుకున్నా YCP నేతలపైనే కేసులు పెడుతున్నారు. కూటమి సర్కార్ తాటాకు చప్పుళ్లకు తాము భయపడం’ అని స్పష్టం చేశారు.
News July 4, 2025
నటి రన్యా రావుకు చెందిన రూ.34 కోట్ల ఆస్తులు అటాచ్

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుకు సంబంధించిన రూ.34 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రన్యా రావును బంగారం అక్రమ రవాణా, హవాలా నగదు బదిలీల కేసులో DRI అధికారులు ఈ ఏడాది మార్చి 5న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో బంగారం కొని భారత్‌కు తరలిస్తుండగా బెంగళూరులో అధికారులు పట్టుకున్నారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు.
News July 4, 2025
సెప్టెంబర్‌లో స్కిల్ పోర్టల్ ప్రారంభం: మంత్రి లోకేశ్

AP: స్కిల్ పోర్టల్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించారు. ‘ఉద్యోగ, ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో స్కిల్ పోర్టల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 90 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ రెడీ అవుతుంది’ అని Xలో పోస్ట్ చేశారు.