News May 10, 2024
సోలార్ స్టాక్స్ జోరు.. ఏడాదిలో 1,318% రిటర్న్స్! – 1/2
దేశీయ స్టాక్ మార్కెట్లలో సోలార్ స్టాక్స్ దూసుకెళ్తున్నాయి. ఏడాది వ్యవధిలో వారీ రెన్యూవబుల్ అనే సంస్థ షేర్లు ఏకంగా 1,318% పెరిగాయి. గత నాలుగేళ్లలో అయితే 49,900% పెరిగింది. 2020లో కనిష్ఠంగా రూ.5కు పడిపోయిన షేర్ విలువ ఇప్పుడు రూ.2,600కు చేరింది. అప్పుడు రూ.100 కోట్లు ఉన్న మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ.27వేల కోట్లకు చేరింది. దేశీయ, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రమేయం లేకుండానే ఈ వృద్ధి సాధించడం విశేషం.
Similar News
News December 27, 2024
బన్నీ బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా
అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని బన్నీ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరడంతో విచారణను జనవరి 10కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా, బన్నీకి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News December 27, 2024
ఈ పుస్తకాల రూపంలో మన్మోహన్ ఎప్పటికీ బతికే ఉంటారు!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆలోచనాపరుడే కాదు మంచి రచయిత కూడా. భారత ఎకానమీ, పాలసీలపై ఆయన పుస్తకాలు రాశారు. అకడమిక్, పాలసీ మేకర్, పొలిటీషియన్‌గా అనుభవంతో ‘Changing India’ పుస్తకాన్ని ఐదు వాల్యూముల్లో అందించారు. ఇండియా ట్రేడ్ పాలసీలపై ‘India’s Export Trends and Prospects for Self-Sustained Growth’, ఆర్థిక అభివృద్ధిలో సమానత్వంపై ‘The Quest for Equity in Development’ పుస్తకాలను రాశారు.
News December 27, 2024
నెలకు రూ.13వేల జీతం.. రూ.21 కోట్ల మోసం!
MHలో నెలకు రూ.13వేల జీతం వచ్చే 23 ఏళ్ల ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాను పనిచేసే సంస్థ పేరుతో నకిలీ ఈ-మెయిల్ సృష్టించి, పాత లెటర్ హెడ్‌తో మెయిల్ మార్చాలని బ్యాంక్‌కు లేఖ రాశాడు. వారు అదే నిజం అనుకొని మార్చగా OTPలు కొత్త మెయిల్‌కు వచ్చేవి. ఇలా e-బ్యాంకింగ్‌తో ₹21 కోట్లు పలు ఖాతాలకు తరలించి GFకు 4BHK, ఖరీదైన కార్లు కొన్నాడు. ఇది సంస్థ దృష్టికి రావడంతో పోలీసులను ఆశ్రయించారు.