News May 10, 2024

మాచర్లలో చంద్రబాబు పర్యటన రద్దు

image

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నిర్వహించాల్సిన మాచర్ల పర్యటన రద్దయినట్లు టీడీపీ కార్యాలయ వర్గాలు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు అక్కడ భారీ వర్షం కురవడంతో ఆలస్యమైంది. దీంతో నావిగేషన్ అధికారులు మాచర్ల నియోజకవర్గం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండటంతో అనుమతులు నిరాకరించారు. బాబు సభ కోసం తరలివచ్చిన వేలాది మంది కార్యకర్తలు నిరుత్సాహ పడ్డారు.

Similar News

News September 12, 2025

తెనాలి: ఆయేషా మీరా తల్లిదండ్రులకు CBI నోటీసులు

image

ఆయేషా మీరా హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా నోటీసులలో పేర్కొంది. దీనిపై ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష ఆవేదన వ్యక్తం చేస్తూ నోటీసులను తిరస్కరించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, బాధితులైన తమను ఎన్నిసార్లు కోర్టుకు తిప్పుతారని తల్లి శంషాద్ బేగం వాపోయారు.

News September 12, 2025

ANUలో ఏపీ పీజీ సెట్ విద్యార్థులకు ఇబ్బందులు

image

ఏపీ పీజీ సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఆలస్యం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసింది. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులను గురువారం పెదకాకానిలోని నాగార్జున విశ్వవిద్యాలయానికి పిలిచినా, తీరా చివరి నిమిషంలో వాయిదా వేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు నిరాశ చెందగా, అధికారులు కేవలం పేర్లు, హాల్ టికెట్ వివరాలు మాత్రమే నమోదు చేశారు. ఈ నిర్లక్ష్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

News September 11, 2025

గుంటూరు జిల్లా కలెక్టర్ నేపథ్యమిదే

image

తమీమ్ అన్సారియ IAS 2015 బ్యాచ్ ఏపీ కేడర్‌కు చెందిన డైనమిక్ ఇండియన్ IAS అధికారిణి. ఆమె డిసెంబర్ 31, 1998 న తమిళనాడులో జన్మించారు. కంప్యూటర్ సైన్స్, పబ్లిక్ మేనేజ్‌మెంట్‌లో బలమైన విద్యా నేపథ్యం ఉన్న ఆమె 2014లో 17 సంవత్సరాల వయసులో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 314 ర్యాంక్ సాధించారు. ఆమె భర్త డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్‌ కూడా ఐఏఎస్‌ అధికారి.