News April 9, 2026
HYD: DANGER.. ఈ బాటిల్స్‌లో వాటర్..!

HYDలో నాసిరకం, కల్తీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. వేసవిలో బయట ఎక్స్‌పైర్డ్, నాసిరకం వాటర్ బాటిల్ కొని తాగితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లేనని వైద్యులు హెచ్చరించారు. బాటిల్‌పై ట్రయాంగిల్‌లో 1 ఉంటే అది సింగిల్ యూజ్. రెండోసారి వాడితే క్యాన్సర్ కారకాలు విడుదలవుతాయి. 3, 6, 7 ఉంటే నాసిరకం ప్లాస్టిక్. 2, 4, 5 ఉంటే 6నెలల వరకు వాడొచ్చు. రంగు మారితే పడేయాలి. స్టీల్, కాపర్ బాటిల్ క్యారీ చేయడం బెటర్.
#SHAREIT
Similar News
News April 10, 2026
విశాఖ: ప్రయాణికులు అలర్ట్.. రైలు సమయంలో మార్పు

విశాఖపట్నం-బ్రహ్మపూర్ ప్యాసింజర్ రైలు (నం.58532) ప్రయాణ సమయం మారినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. లింక్ రైలు ఆలస్యంగా రావడం వల్ల శుక్రవారం సాయంత్రం 5:45 గంటలకు వెళ్లాల్సిన ఈ రైలు రాత్రి 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.
News April 10, 2026
NCLలో 577 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(NCL)లో 577 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డంపర్/గ్రేడర్/డోజర్/సర్ఫేజ్ మైనర్ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, ఓవర్‌సీర్(సివిల్) పోస్టులున్నాయి. జాబును బట్టి 55% మార్కులతో టెన్త్, హెవీ మోటార్ వెహికల్/ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్, ఇంటర్, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18-30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ మే-1. పూర్తి వివరాలకు www.nclcil.in చూడండి.
News April 10, 2026
VKB: భానుడి భగభగలు.. 38 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత

వికారాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే తీవ్రమైన ఎండ వేడిమి ఉండటంతో మధ్యాహ్నానికి ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరుకుంది. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు వడదెబ్బ భయంతో వణికిపోతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీరు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అనవసరంగా బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.


