News May 10, 2024
పోస్టల్ బ్యాలెట్ వివరాలు వెల్లడించిన ముఖేశ్ కుమార్
AP: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తాజాగా వెల్లడించారు. ‘నిన్నటితో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో 25 పార్లమెంటు స్థానాలకు 4,44,216 ఓట్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 4,44,218 ఓట్లు పోలయ్యాయి. పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నెల్లూరులో అత్యధికంగా 22,650 ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా అమలాపురం(ఎస్సీ)లో 14,526 ఓట్లు పోలయ్యాయి’ అని వివరించారు.
Similar News
News January 9, 2025
తిరుపతి తొక్కిసలాట: మృతులకు రూ.25 లక్షల పరిహారం
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు.
News January 9, 2025
కేటీఆర్ క్వాష్ పిటిషన్.. తక్షణ విచారణకు SC నో
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 15న విచారిస్తామని తెలిపింది. అత్యవసరంగా తమ పిటిషన్‌ను విచారణ చేయాలని కోరగా కోర్టు అనుమతించలేదు. ఈ నెల 15న లిస్ట్ అయినందున అదే రోజు విచారిస్తామని స్పష్టం చేసింది. కాగా, హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
News January 9, 2025
జగన్ లండన్ టూర్‌కు కోర్టు అనుమతి
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 30 వరకు ఆయన యూకేలో పర్యటించేందుకు అనుమతులు జారీ చేసింది. కాగా తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన లండన్ పర్యటనకు అనుమతించాలని జగన్ కోర్టును కోరారు.