News May 10, 2024

బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీ కోర్టు షాక్

image

భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు షాకిచ్చింది. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అందుకు తగిన ఆధారాలు రికార్డుల్లో ఉన్నాయని పేర్కొంది. కాగా.. ఈ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ అతడికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా.. అతడి కుమారుడికి అవకాశం ఇచ్చింది.

Similar News

News March 24, 2026

పార్లమెంటులో ప్రశ్నించిన ఎంపీ కావ్య

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో వరంగల్‌కు జరుగుతున్న అన్యాయం పట్ల పార్లమెంట్లో ఎంపీ కడియం కావ్య ప్రశ్నించారు. 2025లో తీసుకొచ్చిన “వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్(గ్రామీణ)” చట్టం కింద 125 రోజుల ఉపాధి హామీ అమలు ఇంకా ప్రారంభం కాలేదని, వెంటనే ఈ హామీని అమలు చేయాలని, తెలంగాణలో పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని అన్నారు.

News March 24, 2026

శివలీల.. పసుపు వేస్తే కుంకుమ అవుతుంది!

image

TG: హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయం అద్భుత ఆధ్యాత్మిక నిలయం. ఇక్కడి శివలింగంపై రాత్రి వేళ భక్తితో పసుపు వేస్తే ఉదయానికి అది కుంకుమగా మారుతుందని భక్తుల విశ్వాసం. ఇది ఆ మహాశివుడి లీలతో పాటు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహమని నమ్మకం. కాకతీయుల కాలం నాటి ఈ పురాతన దేవాలయంలోని ఈ వింతను చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(29/100)

News March 24, 2026

RDTకి అనుమతులు.. CBN క్రెడిట్ చోరీ: జగన్

image

AP: RDTకి FCRA <<19461876>>అనుమతుల<<>> విషయంలో CM CBN క్రెడిట్‌ చోరీకి పాల్పడడం ఆశ్చర్యంగా ఉందని జగన్ ట్వీట్ చేశారు. ‘నిజంగా ఆయన కృషి చేసి ఉంటే 2025 APRలో నిలిచిపోయిన పర్మిషన్ల రెన్యువల్‌కు ఏడాదికాలం ఎందుకు పట్టింది? CBN పట్టించుకోకపోవడం వల్లే YCP, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నది వాస్తవం కాదా’ అని ప్రశ్నించారు. పర్మిషన్లు రెన్యువల్‌ చేసినందుకు PM మోదీ, అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.