News May 10, 2024
ఆ బాంబు బెదిరింపులు పాక్ నుంచే!
అహ్మదాబాద్‌లో స్కూళ్లకు ఇటీవల బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అవి పాక్ నుంచే వచ్చినట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తేల్చారు. భారతీయుల్లో భయాందోళనల్ని వ్యాప్తి చేసేందుకే నిందితుడు ఇలా చేశాడని తెలిపారు. ‘పాక్‌లోని ఫైసలాబాద్ జిల్లా నుంచి తౌహీద్ లియాఖత్ పేరిట ఓ వ్యక్తి అన్ని పాఠశాలలకు మెయిల్స్ పంపించాడు. హమాద్ జావేద్ పేరిట మరో ఐడీని కూడా క్రియేట్ చేసి మెయిల్స్ చేశాడు’ అని తెలిపారు.
Similar News
News January 9, 2025
జగన్ లండన్ టూర్‌కు కోర్టు అనుమతి
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 30 వరకు ఆయన యూకేలో పర్యటించేందుకు అనుమతులు జారీ చేసింది. కాగా తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన లండన్ పర్యటనకు అనుమతించాలని జగన్ కోర్టును కోరారు.
News January 9, 2025
మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రులు
AP: తిరుపతి తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి పరామర్శించారు. రుయా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి ఘటనపై ఆరాతీశారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా మరికాసేపట్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాధితులను పరామర్శిస్తారు.
News January 9, 2025
కొనసాగుతున్న విచారణ.. ప్రశ్నల వర్షం!
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి KTRను విచారిస్తున్నారు. బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు? క్యాబినెట్, ఆర్థికశాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు? నిధులు బదిలీ చేయాలని బలవంతం చేశారా? అని ప్రశ్నలు కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్, ఏసీపీ, సీఐలు మాజీ మంత్రిని విచారిస్తున్నారు.