News May 10, 2024

రేపు సాయంత్రం నుండి మద్యం షాపులు బంద్

image

ఈ నెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 13వ తేదీ రాత్రి 10 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని సూచించారు. వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు.

Similar News

News March 8, 2026

ఖమ్మం: ఈ మహిళా సర్పంచ్ గ్రేట్ కదా..!

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ నాయకన్ గూడెం సర్పంచ్ కంచరి సైదమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భర్త ఆటో నడుపుతూ, టైర్ల షాపు నిర్వహిస్తుండగా.. ఆమె ఖాళీ సమయాల్లో ఆయనకు చేదోడుగా ఉంటూ పంచర్లు వేసేవారు. సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత కూడా ఆమె తన పనిని వదలకుండా, ఒకపక్క గ్రామ అభివృద్ధి పనులు చూస్తూనే.. మరోపక్క కష్టాన్ని నమ్ముకుని శ్రమిస్తున్నారు. ఆమె అంకితభావం మహిళలకు స్ఫూర్తినిస్తోంది.

News March 8, 2026

ఖమ్మం: సుపారీ గ్యాంగ్ సంచారం కలకలం..!

image

బోనకల్ మండలం గోవిందాపురం (ఎల్)లో సుపారీ గ్యాంగ్ సంచారం వార్తలు కలకలం రేపాయి. గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గ్రామస్థులు రెండు గంటల పాటు శ్రమించి పట్టుకున్నారు. నిందితుడు బిహార్‌కు చెందినవాడిగా గుర్తించగా, తమతో పాటు మరో ఐదుగురు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తెలిపాడు. ఈ ఘటనతో భయాందోళనలో ఉన్న గ్రామస్థులు, వెంటనే పోలీసులు స్పందించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

News March 8, 2026

ఖమ్మం: భారీగా యూరియా రాక

image

చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు శనివారం 2,670.84 మెట్రిక్ టన్నుల ఇఫ్కో యూరియా చేరుకుంది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,070.84 టన్నులు, భద్రాద్రికి 500, మహబూబాబాద్‌కు 900, ఖమ్మం సీఆర్పీకి 200 టన్నుల యూరియా కేటాయించినట్లు టెక్నికల్ ఏవో పవన్ కుమార్ తెలిపారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.