News May 10, 2024
IPL: సుదర్శన్ సెంచరీ.. సరికొత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగారు. చెన్నైతో మ్యాచ్‌లో 50 బంతుల్లో శతకం బాదారు. ఇందులో 7 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఇదే క్రమంలో IPLలో అత్యంత వేగంగా(25 ఇన్నింగ్స్‌లు) 1,000 పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్‌గా సుదర్శన్ సరికొత్త రికార్డు సృష్టించారు. సచిన్, రుతురాజ్ 31 ఇన్నింగ్స్‌లలో వెయ్యి రన్స్ చేశారు.
Similar News
News January 9, 2025
కోహ్లీకి చెప్పే స్థాయి గంభీర్‌కు లేదేమో: కైఫ్
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెప్పే స్థాయికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంకా చేరుకోలేదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు. ‘కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పులు తీసుకొచ్చేంత దశకు గౌతీ ఎదగలేదు. ఇది సాధించడానికి ఆయనకు మరికొంత సమయం కావాలేమో. గౌతీ ముందుగా జట్టు కూర్పు గురించి ఆలోచించాలి. గంభీర్ కోచ్‌గా కూడా ఇంకా మరింత ఎదగాల్సి ఉంది’ అని కైఫ్ అభిప్రాయపడ్డారు.
News January 9, 2025
ACB ఆఫీసుకు KTR.. విచారణ ప్రారంభం
TG: కేటీఆర్ కొద్దిసేపటి కిందటే బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు. కేటీఆర్ లాయర్ రామచందర్‌రావు కూడా కార్యాలయంలోకి వెళ్లగా విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూం వరకే ఆయన్ను అనుమతించారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, క్యాబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు తదితరాలపై కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నించనున్నట్లు సమాచారం.
News January 9, 2025
Stock Markets: ఫార్మా, ఫైనాన్స్ షేర్లు డౌన్
బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలే అందాయి. Q3 results నిరాశాజనకంగా ఉంటాయన్న అంచనాతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నారు. నిఫ్టీ 23,608 (-83), సెన్సెక్స్ 77,902 (-245) వద్ద ట్రేడవుతున్నాయి. fmcg, media షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. bank, ఫైనాన్స్, ఫార్మా, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. కొటక్, hul, bajaj auto, itc టాప్ గెయినర్స్.