News May 10, 2024

రేపటి నుంచి 144 సెక్షన్ అమలు: విశాఖ కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి 144 సెక్షన్ అమలులోకి వస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. నలుగురు కంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడటానికి వీలులేదని ఆయన గుర్తు చేశారు. పోలింగ్‌ ముగియడానికి 48 గంటల ముందు నుంచి తమ ప్రచారాన్ని ముగించాలని పోటీదారులకు సూచించారు. అప్పటి నుంచి సైలెంట్ పీరియడ్ అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.

Similar News

News January 26, 2026

పోక్సో కేసు.. ఉత్తర్‌ప్రదేశ్‌లో నిందితుడి అరెస్ట్

image

టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2014 నాటి పోక్సో కేసులో పరారీలో ఉన్న నిందితుడు మహమ్మద్ సల్మాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిందితుడు బెయిల్ పై వెళ్లి 12 ఏళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సీపీ ఆదేశాలతో ప్రత్యేక బృందం యూపీలోని బలరాంపూర్‌లో ఇతడిని పట్టుకుని నగరానికి తరలించింది. నిందితుడిని పట్టుకున్న బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

News January 26, 2026

విశాఖ: అపార్ట్మెంట్లో ఏయూ విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖ నగరంలోని రేసవానిపాలెంలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఏయూ ఎంసీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థి లీలా సాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇతను కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రాంతానికి చెందిన వాడిగా పోలీసులు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం పోలీసులు వచ్చి తలుపులు తెరవడంతో విషయం వెలుగు చూసింది. దీనిపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 26, 2026

విశాఖ: ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

image

విశాఖ పోలీస్ బ్యారెక్స్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి, జిల్లా ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు, నేవీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.