News May 10, 2024

ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలి: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

image

NLG:పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకొనుటకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు.పోలింగ్ ముందు 48 గంటలు ఈనెల11 సాయంత్రం 5 గంటల నుండి పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్ ఉంటుందని వెల్లడించారు.సైలెన్స్ పీరియడ్ లో రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వహించరాదని అన్నారు.జిల్లాలో 144 సెక్షన్ అమలు లో ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News March 19, 2026

నాగార్జునసాగర్: 536 అడుగులకు చేరిన నీటిమట్టం

image

నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు కాగా), గురువారం మూడు గంటల వరకు 536.30 అడుగులు (180.7024 టీఎంసీలకు చేరుకుంది). ఇందులో సాగర్ ఎడమ కాలువకు 8023 క్యూసెక్కులు, కుడికాలువకు 1023 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 2000 క్యూసెక్కులు, ఎల్ఎల్‌సీ వరద కాలువకు 300 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లోగా 18864 క్యూసెక్కులు ఎగువ నుంచి వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు.

నల్గొండ: పుచ్చకాయకు దక్కని ధర: రైతు కుదేలు

image

ఈ వేసవిలో జిల్లాలో సుమారు 2000 ఎకరాల్లో పుచ్చకాయ సాగు చేసిన రైతులు మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పెద్దవూర మండలంలోని పలు గ్రామాల్లో సాగు పెరగడం, పంట ఒక్కసారిగా మార్కెట్‌కు రావడంతో గతంలో రూ.30 పలికిన ధర ప్రస్తుతం రూ.6 నుండి 7కి పడిపోయింది. దీంతో పెట్టుబడి కూడా రాక రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.