News May 10, 2024

విధ్వంసం కావాలా? అభివృద్ధి కావాలా?: చంద్రబాబు

image

వైసీపీ పాలనలో ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఒంగోలులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ‘వైసీపీ అవినీతి, దోపిడీ, కబ్జాలు, అరాచకాలకు ముగింపు పలకాలి. జగన్ ప్రభుత్వం వల్ల అన్ని విషయాల్లో నష్టపోయాం. ఐదేళ్లలో ఒక్క మంచి పని చేశారా? విధ్వంస పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలా? ప్రజలు తేల్చుకోవాలి’ అని సూచించారు.

Similar News

News March 21, 2026

తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్

image

TG: ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ప్రకారం తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.11,29,735తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2,3వ ప్లేస్‌లో HYD(రూ.4,76,679), సంగారెడ్డి(రూ.3,94,587) ఉన్నాయి. రూ.2,37,809 అత్యల్ప తలసరి ఆదాయంతో హనుమకొండ చివరి స్థానంలో ఉంది. కరవు ప్రాంతంగా ముద్రపడ్డ MBNR రూ.3,36,898తో ఆరో ప్లేస్‌కు చేరుకోవడం విశేషం. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ముందుండటం కొసమెరుపు.

News March 21, 2026

ధురంధర్-2 తెలుగు వెర్షన్ నేటి నుంచే..

image

ధురంధర్-2 తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి తెలుగు, తమిళ్, మలయాళం లాంగ్వేజ్‌లు స్క్రీనింగ్ అవుతున్నాయి. కేవలం హిందీలోనే వచ్చిన పార్ట్-1 బ్లాక్‌బస్టర్ కావడంతో పార్ట్‌-2 గురించి తెలుగు ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా ధురంధర్-2ను తెలుగులోనూ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నెల 19న మూవీ రిలీజైనప్పటికీ సాంకేతిక కారణాల వల్ల తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాలేదు.

News March 21, 2026

భర్తకు తీవ్ర అనారోగ్యం.. శ్మశానంలో వదిలివెళ్లిన భార్య!

image

TG: కిడ్నీలు ఫెయిలైన భర్తకు చికిత్స చేయించలేని నిస్సహాయ స్థితిలో భార్య అతడిని శ్మశానంలో వదిలివెళ్లింది. జగిత్యాలకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్(49)కు కిడ్నీలు దెబ్బతినడంతో ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ చేయించినా ఫలితం లేకపోయింది. అద్దె ఇల్లు ఖాళీ చేయాలని ఓనర్ ఒత్తిడి, ఇద్దరు పిల్లల బాధ్యతతో శ్రీధర్‌ను భార్య శ్మశానంలో వదిలి పుట్టింటికి వెళ్లింది. స్థానికులు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించారు.