News May 10, 2024

ఒక ఈవీఎంలో ఎన్ని ఓట్లు వేయొచ్చంటే?

image

ప్రస్తుతం దేశంలో రెండు వెర్షన్‌ల ఈవీఎంలను వినియోగిస్తున్నారు. పాత వెర్షన్ EVM (2000-05 మోడల్)లో గరిష్ఠంగా 3,840 ఓట్లు నిల్వచేయొచ్చు. అదే సమయంలో కొత్త వెర్షన్ EVM (2006 నుంచి వస్తున్న మోడల్)లో గరిష్ఠంగా 2000 ఓట్లను నిల్వ చేయొచ్చు. ఈసీ ప్రకారం కంట్రోల్ యూనిట్‌లో ఎన్నికల ఫలితాలు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

Similar News

News September 19, 2025

మైథాలజీ క్విజ్ – 10

image

1. శ్రీరాముడి పాదధూళితో శాపవిముక్తురాలైంది ఎవరు?
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని ఎవరు చంపారు?
3. కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరు?
4. మధుర మీనాక్షి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది?
5. చిరంజీవులు ఎంత మంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#mythologyquiz<<>>

News September 19, 2025

సూర్యపై ఫిర్యాదు చేయనున్న PCB?

image

పాకిస్థాన్‌పై గెలుపును భారత ఆర్మీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన <<17712252>>సూర్యకుమార్<<>> యాదవ్‌పై పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆటల్లో సూర్య పొలిటికల్ కామెంట్స్ చేశారని, అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని PCB భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే హ్యాండ్ షేక్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సూర్యపై ఫిర్యాదు చేస్తే ఆదివారం భారత్vsపాక్ మ్యాచ్ మరింత హీటెక్కనుంది.

News September 19, 2025

MANUUలో టీచింగ్ పోస్టులు

image

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (<>MANUU<<>>) 13 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, పీహెచ్‌డీ, ఎంఈడీ/ఎంఏ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 65ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500.