News May 10, 2024

వాట్సాప్ కొత్త లుక్‌ వచ్చేసింది!

image

IOS, ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ కొత్త లుక్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఇంటర్‌ఫేస్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఇంటర్ ఫేస్ షేప్, కలర్, ఐకాన్స్, బటన్స్ డిజైన్‌లో మార్పులు చేసినట్లు పేర్కొంది. యూజర్ల కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు, టెక్స్ట్‌ను సులభంగా చదివేందుకు వీలుగా డార్క్ మోడ్‌ను తీసుకొచ్చినట్లు వివరించింది.

Similar News

News March 14, 2025

మార్చి 14: చరిత్రలో ఈ రోజు

image

* 1879: భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జననం
* 1883: రాజకీయ-ఆర్థికవేత్త కార్ల్ మార్క్స్ మరణం
* 1890: మలయాళ పత్రిక ‘మలయాళ మనోరమ’ సర్క్యులేషన్ ప్రారంభం
* 1918: సినీ సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ జననం
* 1931: తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ ముంబైలో విడుదల
* 1965: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ జననం
* 2018: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం

News March 14, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 14, 2025

బోరుగడ్డకు 14 రోజుల రిమాండ్

image

AP: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు కోర్టు రిమాండ్ విధించింది. జైలులో లొంగిపోయిన ఆయనను పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న చిలకలపూడి పోలీసులు అదనపు జిల్లా జడ్జి ముందు హాజరుపరిచారు. చిలకలపూడి పీఎస్‌లో నమోదైన కేసుల్లో అనిల్‌కు ఈ నెల 27 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

error: Content is protected !!