News May 10, 2024

సిక్సుల్లో కోహ్లీ రికార్డు

image

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో చెలరేగిన అతడు T20 క్రికెట్‌లో 400 సిక్సుల మార్కును అందుకున్నారు. ఆ మ్యాచ్‌లో 6 సిక్సులు బాదిన కోహ్లీ మొత్తంగా పొట్టి ఫార్మాట్‌లో 401 సిక్సులు కొట్టారు. అత్యధిక సిక్సులు కొట్టిన భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ(506) మొదటి స్థానంలో ఉండగా కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ ఐపీఎల్లో 12 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 30 సిక్సులు కొట్టారు.

Similar News

News March 18, 2026

ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు

image

AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఇవాళ్టితో ముగిశాయి. చివరి రోజున కెమిస్ట్రీ పరీక్షకు 3.87 లక్షల మంది హాజరయ్యారు. ఈనెల 21 నుంచి వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ పి.రంజిత్ బాషా తెలిపారు. వాల్యుయేషన్ పారదర్శకంగా, తప్పులు దొర్లకుండా చేయాలని అధ్యాపకులకు సూచించారు.

News March 18, 2026

ఉగాది ముహూర్తం.. సమయం ఇదే..

image

రేపటి నుంచి ‘పరాభవ’ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉ.6 గం.53 ని.ల నుంచి ఉ.9.30 వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలని పేర్కొన్నారు.

News March 18, 2026

త్వరలో విశాఖ రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభం

image

AP: విశాఖ రైల్వే జోన్ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. జనరల్ మేనేజర్ (GM) సహా ఇతర ఉన్నతాధికారుల నియామక ప్రక్రియ పూర్తయ్యిందని పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జోన్ ప్రధాన కార్యాలయం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 57KM కొత్త రైల్వే లైన్ కోసం రూ. 2,047 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.