News May 11, 2024
చెన్నైపై గుజరాత్ ఘన విజయం

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో చెన్నైను మట్టికరిపించింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లు ఆడి 196/8 పరుగులకే పరిమితమైంది. జట్టులో మిచెల్ (63), మొయిన్ అలీ (56) అర్థ సెంచరీలతో రాణించారు. చివర్లో ధోనీ (26) సిక్సర్లతో చెలరేగినా అప్పటికే సమయం మించిపోయింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లు తీశారు. రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.
Similar News
News March 18, 2026
వరి పండిస్తే అత్యధిక లాభం రాదు: రేవంత్

TG: రైతులు వరి కాకుండా ఇతర పంటల వైపు మళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘వరి పండిస్తే రైతులకు అత్యధిక లాభం రాదు. వరి నుంచి వాణిజ్య, కూరగాయల పంటలవైపు మళ్లాలి. ప్రపంచానికి ఎగుమతి చేసేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం. సైంటిస్టులతో భూసార పరీక్షలు చేయించి ఏ పంట వేయాలో చెబుతాం. రైతును రాజును చేస్తాం. రైతు రుణమాఫీ చేశాం. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం’ అని అసెంబ్లీలో తెలిపారు.
News March 18, 2026
ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు

AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఇవాళ్టితో ముగిశాయి. చివరి రోజున కెమిస్ట్రీ పరీక్షకు 3.87 లక్షల మంది హాజరయ్యారు. ఈనెల 21 నుంచి వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ పి.రంజిత్ బాషా తెలిపారు. వాల్యుయేషన్ పారదర్శకంగా, తప్పులు దొర్లకుండా చేయాలని అధ్యాపకులకు సూచించారు.
News March 18, 2026
ఉగాది ముహూర్తం.. సమయం ఇదే..

రేపటి నుంచి ‘పరాభవ’ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉ.6 గం.53 ని.ల నుంచి ఉ.9.30 వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలని పేర్కొన్నారు.


