News May 11, 2024

నిషేధ ఆజ్ఞలు అమలులో ఉంటాయి : సీపీ

image

ఈనెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిషేధ ఆజ్ఞలు అమలులో వుంటాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు, ఊరేగింపులు అన్ని రకాల ప్రచారాలు నిషేధించబడతాయన్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. 

Similar News

News July 7, 2025

ఖమ్మం జిల్లా నేటి వార్త సమాచారం

image

☆ బోనకల్, వైరా మండలాల్లో నేడు విద్యుత్ నిలిపివేత
☆ వేంసూర్లో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
☆ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం
☆ నేడు జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు
☆ కారేపల్లిలో నేడు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
☆ ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమం
☆ జిల్లాలో నేడు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల పర్యటన
☆ వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు

News July 7, 2025

పాలేరు జలాశయానికి చేరిన నాగార్జున సాగర్ జలాలు

image

కూసుమంచి మండలం పాలేరు జలాశయానికి ఆదివారం సాగర్ జలాలు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లాలో తాగునీటి అవసరాల నిమిత్తం శుక్రవారం ఉదయం నాగార్జున సాగర్ డ్యాం నుంచి 3000 క్యూసెక్కుల నీరు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల అనంతరం ఆదివారం రాత్రి జలాశయానికి చేరుకున్నాయి. ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News July 6, 2025

ఇందిరమ్మ ఇల్లు రానివారు ఆందోళన చెందొద్దు: ఖమ్మం కలెక్టర్

image

మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో మంజూరవుతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నిరుపేదలైన అర్హులకు దశల వారీగా ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా ఆయా సమీప రీచ్‌ల నుంచి అందిస్తున్నామన్నారు. అటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు.