News May 11, 2024
యువత అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలి: కలెక్టర్

యువత అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ యువతకు శుక్రవారం పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన “అందరూ ఎందుకు ఓటింగ్‌లో పాల్గొనాలి” పై వీడియో తయారీ, పోస్టర్ రూపకల్పనలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆయన నగదుతో పాటు మెమోంటో, సర్టిఫికెట్‌లు అందజేశారు.
Similar News
News March 28, 2026
శ్రీకాకుళం: త్వరలో కాలేజీల్లో ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్

ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రీయంబర్స్మెంట్ అర్హత సాధించాలంటే విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు ఉండాలి. మాన్యువల్ హాజరు వల్ల అనర్హులకు రియంబర్స్మెంట్ అందుతుందని ప్రభుత్వ భావన. అందుకే ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరి చేస్తుంది. జిల్లాలో నాలుగు ఇంజినీరింగ్, 101 డిగ్రీ, 14 బీఈడీ, ఆరు పీజీ, 9 పాలిటెక్నిక్ తదితర కళాశాలల్లో రూ. కోట్లలో రియంబర్స్మెంట్ పొందుతున్నారు.
News March 28, 2026
శ్రీకాకుళం జిల్లాలోని ఈ ప్రాంతాల్లో హీట్ వేవ్

శ్రీకాకుళం జిల్లాలో శనివారం వడగాల్పులకు అవకాశం ఉన్నట్లు APSDMA ఎండీ ప్రఖర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా ఆమదాలవలస, బూర్జలో వడగాల్పులకు అవకాశం ఉందని తెలియజేసింది. బూర్జ మండలంలో పలు ప్రాంతాల్లో గురువారం ఈదురు గాలులు, మెరుపులతో వడగళ్ల వాన సైతం కురుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండలు అధికంగా ఉండే బయట తిరగరాదని విపత్తుల శాఖ హెచ్చరించింది.
News March 27, 2026
శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్

★శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
★పొందూరు: హోటల్స్‌పై విజిలెన్స్ దాడులు.. కేసు నమోదు
★కవిటి: ఒకే కాన్పులో రెండు లేగ దూడలు జననం
★శ్రీకాకుళం: వీరి ప్రేమ కథ విషాదాంతం
★కొత్తూరు: గ్యాస్ కార్యాలయం వద్ద వినియోగదారుల ఇక్కట్లు
★బూర్జ: నేలకొరిగిన జొన్న పంట
★టెక్కలిలో 29న రగ్బీ జిల్లా జట్టు ఎంపికలు


