News May 11, 2024

కార్మికులకు మే 13న వేతనంతో కూడిన సెలవు

image

మే 13వ తేదీన జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు, గుంటూరు జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ శ్రీనివాస్ కుమార్ శుక్రవారం తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని షాపులు, హోటల్లు, సినిమా హాల్స్, వాణిజ్య సంస్థలో పనిచేసే కార్మికులకు, ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు సెలవు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 29, 2025

తుళ్లూరులో ఈ నెల 31 జాబ్ మేళా

image

అమరావతి రాజధాని ప్రాంతంలో 380కి పైగా ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు CRDA కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో CRDA సౌజన్యంతో అక్టోబర్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుంచి తుళ్లూరు స్కిల్ హబ్‌లో జాబ్ మేళా ప్రారంభం అవుతుందని చెప్పారు. 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

News October 29, 2025

తుఫాను అనంతర చర్యలు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

తుఫాను అనంతర చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. సంబంధిత అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుధ్య లోపం లేకుండా చూడాలన్నారు. పునరావాస కేంద్రాలలో కూడా పారిశుధ్య పనులు కొనసాగాలని స్పష్టం చేశారు. ఎక్కడా నీరు నిలువ ఉండరాదని అన్నారు. కాలువల్లో పూడిక తీసి డ్రైన్ లను క్లియర్ చేయాలని చెప్పారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు.

News October 29, 2025

గుంటూరు జిల్లాలో పలు బస్సు సర్వీసులు రద్దు

image

మొంథా తుఫాన్‌ నేపథ్యంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆర్టీసీ పలు సర్వీసులను రద్దు చేసినట్లు డీపీటీఓ సామ్రాజ్యం తెలిపారు. గుంటూరు-1, 2, మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోల్లో కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారని, తద్వారా రద్దీ తగ్గడంతో సర్వీసులు తగ్గిస్తున్నట్లు తెలిపారు. కొన్నిచోట్ల వాగులు పొంగటం, చెట్లు పడటంతో రద్దు చేశామన్నారు.