News May 11, 2024
ముంబైలోని ఓ వీధికి శ్రీదేవి పేరు

దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ఓ వీధికి ఆమె పేరు పెట్టారు. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని ఒక జంక్షన్‌కు అక్కడి ప్రజలు శ్రీదేవీ కపూర్ చౌక్‌గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. కాగా గతంలో ఇదే ప్రాంతంలోని గ్రీన్ ఎకర్స్ టవర్‌లో శ్రీదేవి కుటుంబం నివసించడంతోనే స్థానికులు ఆమె పేరు పెట్టారు.
Similar News
News March 1, 2026
ఇరాన్‌లోని లక్ష్యాలపై క్లాడ్ AI సాయంతో US దాడి

ఇరాన్‌పై దాడిలో ఆంథ్రోపిక్ క్లాడ్ AI సాంకేతికను US వినియోగించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. శత్రువులపై నిఘా, యుద్ధంలో లక్ష్యాలను గుర్తించడానికి క్లాడ్‌ను వాడిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు వివరించింది. యుద్ధంలో తమ AIని వాడేందుకు ఆంథ్రోపిక్ నిరాకరించడంతో ట్రంప్ దాని కాంట్రాక్టును ఇటీవల రద్దుచేయడం తెలిసిందే. అయితే US రక్షణ వ్యవస్థలో అప్పటికే ఆ AI ఇంటిగ్రేట్ అయి ఉండడంతో వినియోగించారంది.
News March 1, 2026
నార్త్ ఈస్ట్రర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో ఉద్యోగాలు

నార్త్ ఈస్ట్రర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో 11పోస్టుల భర్తీకి మార్చి 5, 6తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MSc/MTech రిమోట్ సెన్సింగ్& GIS, జియోఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్స్, MS, BE/BTech, NET/ GATE అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ సైంటిస్ట్‌కు నెలకు రూ.56,100, JRFకు రూ. 37,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nesac.gov.in
News March 1, 2026
త్వరలోనే 10గ్రాముల బంగారం రూ.2లక్షలు?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలపై పెను ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,70,000 <<19269997>>మార్కును<<>> దాటింది. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగి, ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రమైతే అతి త్వరలోనే ఇది ₹2,00,000 మార్కును చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండిని ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణం.


