News April 11, 2026
చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జడ్పీ, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్జీటీ, సమానమైన కేటగిరి టీచర్లకు ప్రమోషన్ సీనియారిటీ జాబితా సిద్ధమైంది. విద్యాశాఖ వెబ్సైట్లో సబ్జెక్టుల వారీగా పొందుపరిచామని డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వీటిపై అభ్యంతరాలను సరైన ఆధారాలతో ఎంఈవో ద్వారా ఈనెల 16వ తేదీలోపు డీఈవో కార్యాలయానికి చేర్చాలని ఆయన సూచించారు.
Similar News
News April 19, 2026
చిత్తూరు: కాలేజీలో కూలిన మెస్ భవనం!

చిత్తూరులో పెను ప్రమాదం తప్పింది. చిత్తూరులోని ఓ కళాశాలలో నూతనంగా నిర్మించిన మెస్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. కూలిన సమయంలో ఆ భవనంలో ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశంపై సంబంధిత కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా.. వాస్తు దోషం కారణంగా ఈ భవనాన్ని కూల్చివేసినట్లు చెబుతున్నారు.
News April 19, 2026
చిత్తూరు: చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి

గుడిపల్లి (M) కనుమనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో గుడ్డలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బేబీ (19), దుర్గ (21) మృతి చెందారు. వరుసకు అక్క చెల్లెలు అయిన బేబీ, దుర్గ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
News April 19, 2026
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్ట్ ఇయర్లో 12,567 మందికి 8,691 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్లో 11,651 మందికి 8,280 మందే పాసయ్యారు, 3,371 మంది ఫెయిలయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 27 లోపు ఫీజు చెల్లించాలి.


