News May 11, 2024
KMM: ఇవాల్టితో ప్రచారానికి తెర

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగడుతున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.
Similar News
News October 31, 2025
రక్తదాన శిబిరానికి భారీ స్పందన: సీపీ సునీల్ దత్

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నేలకొండపల్లి మార్కెట్ యార్డులో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించిందని సీపీ సునీల్ దత్ అన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని కొనియాడారు. ఈ శిబిరంలో సుమారు 1500 మంది దాతల నుంచి రక్తం సేకరించినట్లు తెలిపారు. ఖమ్మం రూరల్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
News October 31, 2025
సీఎం సారూ.. ఖమ్మం రండి: ముంపు వాసులు

ఖమ్మంలో మున్నేరు ముంపు వాసులను ఆదుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. 26 అడుగులకు పైగా మున్నేరు ప్రవహించిన నేపథ్యంలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే వరదతో జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ ఈ రోజు వరంగల్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఖమ్మంలో పర్యటించడం లేదు. దీంతో ముంపు వాసులు సీఎం తమ ప్రాంతంలో పర్యటించి తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
News October 31, 2025
నేటి నుంచి విజయ డెయిరీ దుకాణాలకు టెండర్లు

ఖమ్మం నగరంలోని విజయ డెయిరీ ఆవరణలో నిర్మించిన 10 దుకాణ సమూదాయాలను అద్దెకు ఇచ్చేందుకు నవంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు టెండర్లు నిర్వహిస్తున్నట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కోడిరెక్క రవికుమార్ తెలిపారు. ఒక్కో దుకాణానికి నెలకు రూ.15వేలుగా నిర్ణయించామని, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2 లక్షలు చెల్లించాలన్నారు.


