News May 11, 2024
సూర్యాపేటకు జగదీశ్ రెడ్డి ఏం చేశారో సమాధానం చెప్పాలి: రఘువీర్

సూర్యాపేటకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఏం చేశారో సమాధానం చెప్పాలని నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట అభివృద్ధి దామోదర్ రెడ్డి హయాంలోని జరిగిందన్నారు. పాలేరు రిజర్వాయర్ నుంచి సూర్యాపేట జిల్లాకు నీరు అందించిన ఘనత జానారెడ్డికి దక్కుతుందన్నారు. పదేళ్లలో అటు బిజెపి, ఇటు బిఆర్ఎస్ పార్టీలు చేసింది శూన్యమన్నారు.
Similar News
News March 19, 2026
నల్గొండ: జాతీయ ఫుట్‌బాల్‌లో తేజు ప్రతిభ

హాలియాకు చెందిన చింతలచెరువు తేజు జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌లో ప్రతిభ చాటుతున్నాడు. చిన్న వయసులోనే క్రమశిక్షణతో సాధన చేస్తూ ముందుకు సాగుతున్నాడు. హరియాణాలో జరిగిన అండర్-17 జాతీయ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. స్థానికులు తేజును అభినందిస్తున్నారు. భవిష్యత్తులో మరింత రాణించాలని ఆశిస్తున్నారు.
News March 19, 2026
నల్గొండ జిల్లా రికార్డు సృష్టించింది

నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరుగులు పెడుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి నివేదిక’ 99 రోజుల లక్ష్యంలో భాగంగా, జూన్ 12 నాటికి 6,409 గృహాలను పూర్తి చేయాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అత్యధిక ఇళ్లను నిర్మించిన జిల్లాల్లో రెండో స్థానాన్ని దక్కించుకుని NLG రికార్డు సృష్టించింది. ఇప్పటికే 1809 గృహాలు గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యాయి.
News March 19, 2026
నల్గొండ: ఓటరు జాబితా సవరణకు సహకరించండి: కలెక్టర్

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ కోరారు. బుధవారం తన ఛాంబర్‌లో జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SSR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.


