News May 11, 2024
పేదలంటే ఎందుకంత కక్ష చంద్రబాబు?: YCP

AP: వైఎస్సార్ చేయూత, విద్యాదీవెన, ఇన్‌పుట్ సబ్సిడీ నిధుల పంపిణీని ఈసీ అడ్డుకోవడంపై వైసీపీ చంద్రబాబుపై విమర్శలు గుప్పించింది. ‘ఏపీలోని పేద, మధ్యతరగతి ప్రజలంటే నీకు ఎందుకంత కక్ష చంద్రబాబు? ఎందుకు పేదింటి మహిళలు, రైతులు, పిల్లలకు వచ్చే సంక్షేమ పథకాలను ఆపాలనుకుంటున్నావ్?’ అని Xలో ప్రశ్నించింది.
Similar News
News March 15, 2026
సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు ఎందుకు?

సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. అలాగే ఇంద్రధనస్సులోని 7 రంగులకు సంకేతాలుగానూ చెబుతారు. ఇవి వేదాలలోని 7 ఛందస్సులను కూడా సూచిస్తాయని పండితులు అంటున్నారు. ఈ రథానికి ఉండే ఒకే ఒక్క చక్రం సంవత్సరానికి ప్రతీక. దానిలో ఉండే 12 ఆకులు 12 నెలలకు ప్రతీకలుగా చెబుతారు. సూర్యుని సోదరుడైన అరుణుడు ఈ రథానికి సారథి. సూర్యుని తీవ్రమైన వేడిని ఆయన భరిస్తూ, భూమిపై ప్రాణకోటిని కాపాడతాడు.
News March 15, 2026
పిల్లలకు ఈ పోషకాలు తప్పక ఇవ్వండి

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విటమిన్లు, మినరల్స్ అన్నీ తగినంత అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా విటమిన్లు A, B, C, D, E, అండ్ K వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు పిల్లలకు చాలా అవసరం. ఆరోగ్యకరమైన అభివృద్ధికి వారికి ఫోలేట్, కాల్షియం, అయోడిన్, ఇనుము, జింక్ కూడా కావాలి. ఈ పోషకాలు పిల్లల మెదడు, నరాల అభివృద్ధి, కంటి చూపు, ఎముకల బలం, రోగనిరోధక శక్తి, జీవక్రియకు సహకరిస్తాయి.
News March 15, 2026
రేపటి నుంచి ‘రైతన్నా.. మీ కోసం’

AP: సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 16 నుంచి 10 రోజుల పాటు ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రిటెక్, డీప్‌టెక్ ద్వారా రానున్న ఖరీఫ్ సీజన్‌లో సాగు విధానాలపై అవగాహన కల్పిస్తారు. ప్రకృతి వ్యవసాయం, ఎల్‌నినో నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తారు. ఈ నెల 25న జరిగే ముగింపు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.


