News May 11, 2024

ఓటర్ స్లిప్పు రాలేదా.. ఆందోళన వద్దు

image

ఖమ్మం: ఈనెల 13న జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఓటర్ స్లిప్పు రానివారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే స్లిప్పు రాకుండా ఒక ఎస్ఎంఎస్ తో పోలింగ్ బూతులో ఓటు ఉందో లేదో సులభంగా తెలుసుకొని అవకాశం ఉంది. ఓటరు తన ఫోను నుంచి ఈ సీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ కార్డు నెంబరు నమోదు చేసి 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు మెసేజ్ పంపించాలి. వెంటనే పోలింగ్ బూత్ నెంబర్ ఓటర్ జాబితాలోని క్రమసంఖ్య వివరాలతో మెసేజ్ వస్తుంది.

Similar News

News March 18, 2026

ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి హిందీ పరీక్ష

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా పదో తరగతి హిందీ పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 16,990 మంది విద్యార్థులకు గానూ 16,972 మంది హాజరయ్యారని, 99.89 శాతం హాజరు నమోదైనట్లు డీఈవో చైతన్య జైనీ తెలిపారు. పరీక్షా కేంద్రాలను డీఈవోతో పాటు ఏసీజీఈ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ముమ్మరంగా తనిఖీ చేశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

News March 18, 2026

ఖమ్మం: రేషన్ బియ్యం పంపిణీపై అదనపు కలెక్టర్ సమీక్ష

image

ఖమ్మం జిల్లాలోని బఫర్ గోదాముల నుంచి రేషన్ బియ్యం పంపిణీ తీరుపై అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు మూడు నెలల కోటాను ఒకేసారి లబ్ధిదారులకు అందించాలన్న కేంద్ర ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 12 గోదాములకు ఇన్‌చార్జిలను నియమించి, సకాలంలో సరఫరా జరిగేలా చూడాలన్నారు.

News March 18, 2026

ఖమ్మం: నీటి ఎద్దడిపై అధికారుల ‘యాక్షన్ ప్లాన్’

image

ఖమ్మం జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మకమైన 18 గ్రామాలను గుర్తించి, అక్కడ ట్యాంకర్లు లేదా ప్రైవేట్ వనరుల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటి సమస్యల ఫిర్యాదుల కోసం 1916 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చామని, మరమ్మతుల కోసం సుమారు రూ.90 లక్షలు ఖర్చవుతుందని ఈఈ పుష్పలత తెలిపారు.