News May 11, 2024

ఇప్పటివరకు రూ.2కోట్లకు పైగా నగదు సీజ్

image

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని లాడ్జీలు, హాటళ్లలో పోలీసులు సోదాలు చేస్తూ అపరిచిత వ్యక్తులు ఉంటే ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులు రూ.2కోట్లకు పైగా నగదును సీజ్ చేయగా, పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్త తనిఖీల్లో రూ.కోటి పైగా విలువైన మద్యం, రూ.20లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అయితే, చివరి 2 రోజులు మరింత కీలకం కావడంతో తనిఖీలు ముమ్మరం చేసేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది.

Similar News

News March 10, 2026

నేటి నుంచి పశువులకు గాలికుంటు టీకాలు

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి పురందర్ తెలిపారు. మంగళవారం నుంచి ఏప్రిల్ 9 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. పశువైద్య బృందాలు గ్రామాలను సందర్శించి మూడు నెలలు దాటిన గేదె, గోజాతి పశువులకు టీకాలు వేస్తాయని వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పశువులను రక్షించుకోవాలని ఆయన కోరారు.

News March 10, 2026

నిర్వాసితులకు అండగా ఉంటాం: మంత్రి పొంగులేటి

image

ఖమ్మం వెలుగుమట్ల ఇళ్ల నిర్వాసితులందరికీ ప్రభుత్వం తరపున పూర్తి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. వారికి ఇంటి పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. క్రషర్ వివాదంపై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అసత్య ప్రచారాలు చేసే వారికి అసెంబ్లీ సాక్షిగా గట్టి సమాధానం చెబుతానని మంత్రి హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

News March 9, 2026

రుణ లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ప్రాధాన్యత రంగ రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో చేరుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో నిర్వహించిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, విద్య, గృహ నిర్మాణంతో పాటు ఎంఎస్‌ఎంఈ రంగాలకు రుణాల పంపిణీపై సమీక్షించారు. యువతకు స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించి ఆర్థిక చేయూత అందించాలని సూచించారు.