News May 11, 2024
విశాఖ: నేటి సాయంత్రంతో ప్రచారం పరిసమాప్తి

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా నేటి సాయంత్రం 6 గంటలకు తమ ప్రచారాన్ని ముగించాలి. ఓటింగ్ జరగడానికి 48 గంటలు ముందుగా అభ్యర్థులు తమ ప్రచారాలను ముగించాలి. దీంతో ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత అభ్యర్థులు ఎటువంటి ప్రచారాలు సభలు నిర్వహించకూడదు. రేపు, ఎల్లుండి పత్రికల్లో ఇచ్చే ప్రకటనలపై కూడా ఎన్నికల సంఘం అనుమతితో మాత్రమే ప్రచురించాల్సిన అవసరం ఉందని జిల్లా అధికారులు సూచించారు.
Similar News
News March 13, 2026
విశాఖ పోలీసులను అభినందించిన సీఎం

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సైబర్ నేరాలపై విశాఖ పోలీసులు రూపొందించిన 24 షార్ట్ ఫిలింలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ట్రంలో సైబర్ మోసాలతో రూ.వేల కోట్ల నష్టం జరుగుతున్న నేపథ్యంలో అవగాహన పెంచేందుకు వీటిని రూపొందించినట్లు విశాఖ సీపీ బాగ్చీ వివరించారు. ఈ కృషికి పోలీసులను సీఎం అభినందించారు.
News March 12, 2026
మధురవాడ: ఉరివేసుకుని యువకుడు మృతి!

మధురవాడ గణేష్ నగర్‌లో తాడి ప్రవీణ్ కుమార్ (27) అనే యువకుడు మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చింతపల్లికి చెందిన ప్రవీణ్ గత ఆరేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తూ, స్థానిక టెలిఫోన్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 12, 2026
విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చర్లపల్లికి కొత్త సూపర్ ఫాస్ట్ రైలు!

రైల్వే ఆధునీకరణలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. కొక్రాఝర్ – చర్లపల్లి (05674) స్పెషల్ రైలు శనివారం సాయంత్రం పెందుర్తి (17:58), దువ్వాడ (19:30) స్టేషన్లకు చేరుకుంటుంది. 20 కోచ్‌లతో నడిచే ఈ అత్యాధునిక రైలు సామాన్య ప్రయాణికులకు హైదరాబాద్ వెళ్లేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది


