News May 11, 2024

ట్రెండింగ్‌లో పిఠాపురం

image

పోలింగ్ సమీపించడంతో తెలుగు రాష్ట్రాల చూపు పిఠాపురంపై పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గం పేరు ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఇతర నటులు పవన్‌కు మద్దతు ప్రకటించారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిన పవన్.. ఈసారి గెలిచి చట్టసభల్లోకి అడుగుపెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జగన్ ఇవాళ పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు.

Similar News

News October 20, 2025

నరకాసురుడిని సత్యభామే ఎందుకు చంపింది?

image

నరకాసురుడికి తన తల్లి భూదేవి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం ఉండదనే వరం ఉంది. సత్యభామ భూదేవి అంశ కాబట్టి, ఆమె నరకాసురుడిని చంపవచ్చు. అందుకే కృష్ణుడు అసురుడిని చంపడానికి తనతో పాటు సత్యభామను కూడా వెంట తీసుకెళ్తాడు. ఆ యుద్ధంలో కృష్ణుడి సహాయంతో సత్యభామ నరకాసురుడిని సంహరించింది. ఇలా బ్రహ్మ ఇచ్చిన వరం సార్థకమైంది. వరం నిలబడటంతో పాటు ధర్మ స్థాపనా జరిగింది. అందుకే వెలుగుల పండుగ దీపావళి జరుపుకొంటాం.

News October 20, 2025

కృష్ణుడు 16 వేల మంది గోపికలను ఎందుకు వివాహం చేసుకున్నాడు?

image

కృష్ణుడికి 16 వేల మంది భార్యలని మనం చదువుకున్నాం. అయితే వీరంతా నరకాసురుడు అపహరించి, బంధించిన రాజకన్యలు. రాక్షసుడి చెరలో ఉన్నందున, ఆనాటి కట్టుబాట్ల వల్ల వారిని వారి కుటుంబాలు స్వీకరించవు. దీంతో వారు అపవిత్రులు కాకుండా కాపాడమని కృష్ణుడిని వేడుకున్నారు. వారి ధర్మాన్ని, గౌరవాన్ని నిలబెట్టడానికి ఆయన వారిని వివాహం చేసుకున్నాడు. లోకం వారిని కృష్ణుడి భార్యలుగా భావిస్తుంది. నిజానికి వీరు ఆయన పరమ భక్తులు.

News October 20, 2025

ముత్యాల గర్భం గురించి తెలుసా?

image

ప్రెగ్నెంట్ అయినా కడుపులో బిడ్డలేని పరిస్థితినే ముత్యాల గర్భం అంటారు. కడుపు పెరుగుతుంది, వాంతులు అవుతాయి, ప్రెగ్నన్సీ హార్మోన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఆరోగ్యకరమైన స్పెర్మ్ , ఒక ఆరోగ్యకరమైన అండంతో సంయోగం చెందితే పిండం ఏర్పడుతుంది. అలా రెండు క్రోమోజోములు బిడ్డకు వస్తాయి. కానీ ముత్యాల గర్భం శుక్రకణం క్రోమోజోములు లేని ఖాళీ అండంతో ఏర్పడుతుంది. ఇది బుడగల ఆకారంలో ఎదుగుతుంది.