News May 11, 2024

విశాఖ: ఓటుకు రూ.1000 నుంచి 1500..?

image

మరో 48 గంటల్లో ఈవీఎంలపై బటన్ నొక్కేందుకు ఓటరు సిద్ధమవుతుండగా..వారిని ఆకర్షించేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాను సేకరించి రూ.1000 నుంచి 1500 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల వారికి ఆన్‌లైన్ పేమెంట్ చెయ్యగా.. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఇస్తున్నారు. పట్టణాల్లో టోకెన్ సిస్టం పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తుండంతో అధికారులు నిఘా పెంచారు.

Similar News

News January 15, 2026

విశాఖలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో నగరంలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ కార్యాలయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ విశాఖలో నిరంతర నిఘా కొనసాగించారు. గంజాయి వంటి మత్తుపదార్థాలు రవాణా కాకుండా ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

News January 15, 2026

సింహాచలంలో 18న అప్పన్న తెప్పోత్సవం

image

వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 18న (ఆదివారం) వరాహ పుష్కరిణిలో వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపై నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉత్సవం కారణంగా ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.

News January 15, 2026

గాజువాక: లారీ ఢీకొట్టి వ్యక్తి మృతి

image

గాజువాక వడ్లపూడి జంక్షన్ ఆటోనగర్ వెళ్లే రహదారిలో లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నిన్న రాత్రి జరిగింది. వడ్లపూడిలో నివాసం ఉంటున్న చింత సంతోష్ కుమార్ ఇంటికి వెళ్ళటానికి రోడ్డు దాటుతుండగా కూర్మన్నపాలెం నుంచి గాజువాక వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంతోష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.