News May 11, 2024
సుల్తానాబాద్: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

బావిలో పడి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సుల్తానాబాద్‌లో జరిగింది. ఎస్ఐ, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. యాదవ్ నగర్‌కు చెందిన చింతల రాజు(20) గురువారం రాత్రి భోజనం చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శుక్రవారం ఓ వ్యవసాయ బావి వద్ద తన బైక్, చెప్పులు గమనించారు. కొడుకు మృతిపట్ల అనుమానాలు ఉన్నట్లు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 4, 2026
రేపు కరీంనగర్ జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి రేపు చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణాలను పరిశీలించి, భద్రతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారీ పోలీస్ బందోబస్తుతో పాటు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలాలను కేటాయించారు.
News February 4, 2026
అభివృద్ధికి కేసీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదు: మంత్రి

కొండగట్టు దేవాలయానికి మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విమర్శించారు. చొప్పదండిలో ఆయన మాట్లాడుతూ.. కొండగట్టు ఆలయ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, అందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే చొప్పదండి నియోజకవర్గంలో వరద కాలువకు ఓటిలు, నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి సాగు నీరు అందిస్తామని అన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.
News February 4, 2026
జమ్మికుంట పురపోరు.. బీసీలకు 42 శాతం టికెట్లు

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ కృషి చేశారు. 30వార్డుల్లో అధికారులు ఆన్‌రిజర్వ్ -మహిళా 8, ఆన్‌రిజర్వ్- జనరల్ 7 కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్ లో బీసీ-8, ఎస్సీ-3, OC-4 వార్డులకు B-ఫారం కేటాయించారు. ఈ నిర్ణయంతో బహుజన వర్గాలకు న్యాయం జరిగిందని, బీసీల రాజకీయ భాగస్వామ్యం పెరుగుతుందని నేతలు హర్షం వ్యక్తం చేశారు


