News May 11, 2024
ఓటరు చీటీల్లో పాత పోలింగ్ వేళలే!

TG: ఎల్లుండే పోలింగ్ కావడంతో ఓటరు చీటీల పంపిణీ వేగంగా జరుగుతోంది. అయితే చీటీల్లో పోలింగ్ వేళలు పాతవే ఉండటం ఓటర్లను అయోమయానికి గురి చేస్తోంది. సాధారణంగా పోలింగ్ సమయం ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు ఉంటుంది. ఎండాకాలం కావడంతో సమయం పెంచాలన్న రాజకీయ పార్టీల విజ్ఞప్తితో ఈసీ సా.6 గంటల వరకు పొడిగించింది. కానీ చీటీల్లో మాత్రం పాత టైమింగ్సే ఉన్నాయి. అప్పటికే చీటీలు ప్రింట్ కావడమే అందుకు కారణమని తెలుస్తోంది.
Similar News
News September 18, 2025
చంద్రబాబూ.. అధికారంలోకి వచ్చింది ఇందుకేనా: జగన్

AP: ‘పేదలకు ఇళ్ల’ విషయంలో కూటమి ప్రభుత్వ పనితీరు సున్నా అని మాజీ సీఎం, YCP అధినేత జగన్ విమర్శించారు. ‘చంద్రబాబు గారూ మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? ఇప్పటివరకూ ఏ ఒక్కరికీ పట్టాలివ్వలేదు. మా హయాంలో ఇచ్చిన వాటిని లాక్కుంటున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాలని పార్టీ కేడర్‌కు పిలుపునిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
News September 18, 2025
ఈనెల 21న ‘OG’ ట్రైలర్

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిన ‘OG’ సినిమా ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 21న ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేస్తామంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈనెల 25న విడుదలయ్యే ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా టికెట్ <<17742687>>ధరలను<<>> పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులిచ్చింది. తెలంగాణలో ధరలు పెరుగుతాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
News September 18, 2025
ఆహా! ఎంత అద్భుతమైన శ్లోకం (1/2)

‘తం భూసుతా ముక్తిముదార హాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీ:
శ్రీ యాదవం భవ్య భతోయ దేవం
సంహారదా ముక్తి ముతా సుభూతం’
పండిత దైవజ్ఞ సూర్య సూరి రచించిన శ్రీ రామకృష్ణ విలోమ కావ్యంలోని శ్లోకమిది. ముందు నుంచి చదివినా, వెనుక నుంచి చదివినా ఈ శ్లోకం ఒకేలాగా(వికటకవి లాగ) ఉంటుంది. ఎడమవైపు నుంచి చదివితే శ్రీరాముణ్ని, కుడివైపు నుంచి చదివితే శ్రీకృష్ణుణ్ని స్తుతించేలా ఉన్న ఈ శ్లోకం అద్భుతం కదా!