News May 11, 2024

కడప: ఓటుకు రూ.4 వేలు.?

image

కడప జిల్లాలో ఓట్ల పండగ జరగనుంది. నేటితో ప్రచారం ముగియనుండగా, ఓటర్లను నాయకులు ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఓటుకు రూ.2వేలు ఇస్తున్నట్లు సమాచారం. కడప, బద్వేలు, కోడూరులో 1000 నుంచి 1500 ఇస్తుండగా, రాజంపేటలో గరిష్ఠంగా రూ.4 వేలు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో అభ్యర్థులు పోటాపోటీగా డబ్బులు పంచడానికి సిద్ధమవుతున్నారని టాక్ నడుస్తోంది.

Similar News

News October 28, 2025

తుఫానుపై ఆందోళన వద్దు: కడప ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

తుఫాను ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదిదిసింగ్ సూచించారు. జిల్లా స్థాయి అధికారులతో సోమవారం సాయంత్రం ఆమె టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర చర్యలకు కడపతోపాటు RDO కార్యాలయాలన్నింటిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News October 27, 2025

కడప జిల్లా కలెక్టర్ తనయుడికి పలువురు నేతల శుభాకాంక్షలు

image

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తనయుడు రిసెప్షన్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ రిసెప్షన్‌కు ఏపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కడప జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌ఛార్జులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన జంట వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

News October 27, 2025

మొంథా తుఫాన్.. కడప JC కీలక సూచనలు

image

కడప జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలకు JC అదితి సింగ్ పలు <>సూచనలు<<>> చేశారు.
➤సోషల్ మీడియాలో వచ్చే అవాస్థవాలను నమ్మొద్దు.
➤వాతావరణ హెచ్చరికల కోసం సెల్ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకొని, SMSలను గమనిస్తూ ఉండండి.
➤విలువైన పత్రాలను వాటర్ ఫ్రూఫ్ కవర్లలో ఉంచండి.
➤మీ ఇల్లు సురక్షితం కాకపోతే.. సురక్షితమైన స్థానాలకు వెళ్లండి.
➤పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్ల కింద ఉండకండి.
>> SHARE IT