News May 11, 2024
HYD: ఇంటర్ ఫెయిల్.. యువతి అదృశ్యం

ఇంటర్ ఫెయిల్ కావడంతో ఓ యువతి అదృశ్యమైంది. పోలీసుల వివరాలు.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ కుటుంబం మల్కాజిగిరిలోని రామకృష్ణాపురంలో నివాసం ఉంటుంది. వారి కుమార్తె (19) ఈనెల 9న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఇంట్లో తల్లికి కుమార్తె రాసిన లేఖ లభించింది. ఇంటర్‌లో ఫెయిల్ అయినందుకు మనస్తాపంతో వెళ్లిపోతున్నట్లు లేఖలో పేర్కొంది. శుక్రవారం తల్లి ఫిర్యాదుతో నేరెడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 4, 2025
HYD: ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం.. ముగ్గురి అరెస్ట్

HYD సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాన్ని తాజాగా బట్టబయలు చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులతో రూ.లక్షల్లో ప్రజలను మోసగించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఫేక్ ట్రేడింగ్ యాప్‌ల ద్వారా రూ.60 లక్షలకు పైగా వీరు కాజేశారు. బ్యాంక్ అకౌంట్లు సైబర్ నేరగాళ్లకు ఇచ్చి కమీషన్ తీసుకుంటున్నట్లు బయటపడింది. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్లలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
News November 4, 2025
HYD: BRS పాలనలో అవకతవకలు: మంత్రి

HYDలోని తెలంగాణ సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ చివరికల్లా పంపిణీ పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. చేపల తినడం వల్ల ఆరోగ్య లాభాలపై విస్తృత ప్రచారం చేయాలని, గత BRS ప్రభుత్వ పాలనలో పంపిణీలో అవకతవకలు జరిగాయని, ప్రతి చెరువు వద్ద పంపిణీ వివరాల సైన్‌బోర్డులు ఏర్పాటు చేసి, వివరాలను టి-మత్స్య యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు.
News November 3, 2025
మీర్జాగూడ ఘటన.. స్వాతి మృతి

చేవెళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో తాండూరు పట్టణం వాల్మీకి నగర్‌కి చెందిన వెంకటమ్మ అలియాస్ స్వాతి(22) అనే వివాహిత మృతిచెందింది. బూరుగుపల్లికి చెందిన లక్ష్మమ్మ-ఏసప్పల కూతురైన స్వాతి వాల్మీకి నగర్‌కు చెందిన ప్రసాద్‌కు రెండున్నరేళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు. స్వాతి హైదరాబాద్‌లో ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తుండగా, ప్రసాద్ క్యాంటీన్‌లో పనిచేస్తుంటాడు. స్వాతి ఊరు నుంచి వస్తూ ప్రమాదంలో మరణించింది.


