News May 11, 2024
పోలీస్ సైరన్.. రూ.2కోట్లు రోడ్డుపై పడేశారు!

AP: పోలీసులు వెంబడిస్తున్నారనే భయంతో అర్ధరాత్రి ఆగంతకులు రూ.2కోట్ల నగదును రహదారిపై పడేసి వెళ్లిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలో చోటు చేసుకుంది. పోలీస్ సైరన్ వినిపించడంతో ఇళ్ల ముందు డబ్బు సంచులు పడేసి వెళ్లిపోయారు. కొంతసేపు ఆగి వచ్చి చూడగా అందులో రూ.40 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. అక్కడి ప్రజలను విచారించి లాభం లేక మిగతా డబ్బుతో వెనుదిరిగారట. ఈ డబ్బు హిందూపురానికి తరలిస్తున్నట్లు సమాచారం.
Similar News
News March 14, 2025
వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
News March 14, 2025
జనసేన ఆవిర్భావ దినోత్సవం.. అంబటి సెటైర్

AP: జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని సెటైర్ వేశారు.
News March 14, 2025
WPL: ఈ సారైనా కప్పు కొట్టేనా?

WPL 2025లో కప్పు కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడనున్నాయి. మూడో సారి ఫైనల్ చేరిన DC జట్టు ఈ సారైనా కప్పు కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు MI రెండోసారి ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని ఎదురుచూస్తోంది. అయితే ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముంబైపై ఢిల్లీదే పైచేయి కావడం ఆ జట్టుకు సానుకూలంగా ఉంది. మరి రేపు జరిగే తుది పోరులో DC ఇదే జోరు కొనసాగిస్తుందో డీలా పడుతుందో చూడాలి.