News May 11, 2024
పెనగలూరు: ప్రమాదవశాత్తూ బాలుడి మృతి

ఈట మాపురంలో ప్రమాదవశాత్తు కింద పడి ఓ బాలుడు మృతిచెందాడు. కుటుంబ సభ్యుల వివరాలు మేరకు.. మహేశ్వర్ రాజు, అశ్వనిల మొదటి కుమారుడు కుశాల్ కుమార్ రాజు (7) తాత వద్ద ఉన్న సెల్ ఫోన్ చూస్తూ వెనుకకు జరుగుతూ అరుగుపై నుంచి కిందపడ్డాడు. తల వెనుక భాగం ముందుగా నేలను తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గల్ఫ్ లో ఉన్న మహేశ్వర్ రాజు విషయం తెలియగానే ఇంటికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించాడు.
Similar News
News January 7, 2026
కడపలో శ్రీరామ శోభాయాత్ర, కళ్యాణ ఏర్పాట్లపై సమీక్ష

ఈనెల 21, 22 తేదీల్లో కడప మున్సిపల్ గ్రౌండ్స్లో జరగనున్న శ్రీరామ మహా శోభాయాత్ర, శ్రీ సీతారాముల కళ్యాణం విజయవంతం కావాలని మంగళవారం కలెక్టర్ శ్రీధర్ అధికారులతో సమీక్ష చేశారు. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, MLA మాధవి కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఏర్పాట్లు సజావుగా, ఘనంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

News January 6, 2026
కడప జిల్లాలో ఉల్లి రైతులకు రూ.28.40 కోట్ల సాయం.!

కడప జిల్లాలో 7298 మంది ఉల్లి రైతులకు 14,203.31 ఎకరాలకు రూ.28.40 కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.
*కమలాపురం 2526 మందికి రూ.11.32 కోట్లు
*మైదుకూరు 2352 మందికి రూ.7.74 కోట్లు
*పులివెందుల 1590 మందికి రూ.6.17 కోట్లు
*జమ్మలమడుగు 742 మందికి రూ.2.99 కోట్లు
*బద్వేల్ 67మందికి రూ.14.92 లక్షలు
*రాజంపేట 18మందికి రూ.2.33 లక్షలు
*కడప ఇద్దరికి రూ.35,900
*ప్రొద్దుటూరులో ఒకరికి రూ.20.60 వేలు.