News May 11, 2024

నెల్లూరు: సమయం లేదు మిత్రమా.. ఓట్ల వేటలో అభ్యర్థులు

image

ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. అభ్యర్థులు పార్టీ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటు తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలు సేకరించి వారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Similar News

News March 27, 2026

సీతారాముల కళ్యాణం ఉత్సవంలో పాల్గొన్న SP దంపతులు

image

మూలాపేట పోలీస్ లైన్స్‌లో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో జిల్లా SP డా. అజిత దంపతులు, అడిషనల్ SP సౌజన్య దంపతులు పాల్గొన్నారు. వీరు స్వామివారి కళ్యాణంలో పీటలపై కూర్చుని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

News March 27, 2026

నెల్లూరు జిల్లాలో ఆ బస్సులు చాలా డేంజర్..!

image

మార్కాపురం ప్రమాదంతో నెల్లూరుD) కలిగిరికి చెందిన <<19487686>>హరికృష్ణ <<>>ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన డొక్కు బస్సులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని సమాచారం. వాటిపై పాత ట్రావెల్స్ పేర్లు ఉండటమే ఇందుకు నిదర్శనం. ప్రయాణ సమయంలో తరచూ రిపేర్లకు గురవుతుంటాయని.. చాలాసార్లు మార్గమధ్యంలోనే బస్సులను మారుస్తుంటారని అందులో ప్రయాణించిన వాళ్లు చెబుతున్నారు.

News March 27, 2026

నెల్లూరు: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

image

మార్కాపురంలో ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరుగురు చనిపోయారు.
➤ముత్తంగి వెంకటేశ్వర్లు(దాసరిపల్లి, ఉదయగిరి)
➤ఆత్మకూరు చిన్నయ్య(నాగసముద్రం, కలిగిరి)
➤కత్తి జయరాములు(మంగళకట్ట, బుచ్చి)
➤గుల్లపల్లి వెంకటేశ్వర్లు(నాయుడుపల్లి, దుత్తలూరు)
➤నర్సింగు ప్రభావతి, చైత్రి(తూర్పు యర్రబల్లి, కొండాపురం)