News May 11, 2024

లెక్క మారుతోంది.. ఓటుకి రూ.3వేల నుంచి రూ.5వేలు!

image

AP: రాష్ట్రంలో ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో నగదు పంపిణీ లెక్కలు మారిపోతున్నాయి. ఇప్పటికే రూ.3వేల వరకు పంపిణీ జరిగిపోయినట్లు సమాచారం. అయితే ప్రత్యర్థి పార్టీ నగదు మొత్తాన్ని పెంచడంతో అవతలి పార్టీ కూడా మరింత పెంచి ఇస్తోందట. పోటాపోటీగా సాగుతున్న పంపకాల్లో కొన్నిచోట్ల ఓటుకు రూ.5000 దాటి పోయినట్లు తెలుస్తోంది. పెంచిన మొత్తాన్ని ఇవాళ, రేపు ఓటర్లకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Similar News

News December 31, 2025

మహిళలకు అత్యంత అనుకూలమైన దేశం డెన్మార్క్‌

image

ఉమెన్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ (WPS) ఇండెక్స్‌-2025లో మహిళలకు అత్యంత అనుకూలమైన దేశంగా డెన్మార్క్‌ అగ్ర స్థానంలో నిలిచింది. ఉద్యోగ, ఉపాధితోపాటు ప్రతి రంగంలోనూ ఇక్కడి మహిళలకు విస్తృతమైన అవకాశాలు, భద్రత లభిస్తోంది. లింగవివక్ష, మహిళలపై హింస ఉండవు. కీలక నిర్ణయాల్లో మహిళల ప్రాతినిధ్యం, బలమైన చట్టాలు, సురక్షిత వాతావరణం, ఆరోగ్యం-చదువులో ఉన్నత ఫలితాలు సాధించడం వంటివి దీన్ని లెక్కించే సూచికలు.

News December 31, 2025

కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా!

image

TG: గత సీజన్‌లో ఇచ్చినట్లుగానే ఈసారి కోటిన్నర ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కింద సంక్రాంతి నాటికి రైతు భరోసా నగదు రైతు ఖాతాల్లో జమ చేసే యోచనలో ఉంది. సాగు భూములకు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటికీ ఆ లెక్కలు తేలలేదు. ఈ పథకం ద్వారా ఎకరానికి రూ.6వేల చొప్పున ఏడాదికి రెండు విడతల్లో నగదు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

News December 31, 2025

సోదరుడి కుమారుడితో అసిమ్ కూతురి పెళ్లి!

image

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తన మూడో కూతురి పెళ్లి చేశాడు. తన సోదరుడి కుమారుడు అబ్దుల్ రహమాన్‌కు ఇచ్చి రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో DEC 26న వివాహం జరిపించాడని నేషనల్ మీడియా పేర్కొంది. ఈ వేడుకకు పాక్ అధ్యక్షుడు, ప్రధాని, ISI చీఫ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా మునీర్‌కు నలుగురు కూతుళ్లు. అబ్దుల్ రహమాన్‌ ఆర్మీలో పని చేసి రిజర్వేషన్ కోటాలో సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యాడు.